RX 100 : యమహా RX100 భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా నిలిచింది. ఈ బైక్ హఠాత్తుగా నిలిచిపోవడం కంపెనీకి, వినియోగదారులకు పెద్ద షాక్‌ను కలిగించింది. నేటికీ దీని కోసం ఎదురు చూసే అభిమానులు చాలా మందే ఉన్నారు.అయితే ఇప్పుడు ఇది మళ్లీ రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, కంపెనీ ఈ బైక్‌ను జూన్ 2026 నాటికి విడుదల చేయవచ్చు. ఇది మరోసారి వినియోగదారుల హృదయాలను గెలుచుకోవడానికి రెడీ అవుతుంది. దీని మైలేజ్ కూడా చాలా బాగుండబోతోంది. దీని లుక్, డిజైన్ వినియోగదారులకు ఫస్ట్ ఛాయిస్ గా మారబోతుంది. యమహా RX 100 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు పోటీ ఇవ్వగలదని భావిస్తున్నారు.
Also Read : కేవలం రూ.3 వేలకే టీవీఎస్ బైక్.. ఆఫీసుకు వెళ్లడానికి బెస్ట్ ఇదే
యమహా RX100
1985లో విడుదలైన యమహా RX100 భారతీయ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ 2-స్ట్రోక్ బైక్ అద్భుతమైన పర్ఫామెన్స్, స్పీడ్, పవర్ ఫుల్ ఎగ్జాస్ట్ సౌండ్ తో ఫేమస్ అయింది. ఈ బైక్ ప్రత్యేకంగా యువ రైడర్‌లలో చాలా ప్రజాదరణ పొందింది. ఇప్పుడు దశాబ్దాల తర్వాత RX100 కొత్త లుక్ లో, లేటెస్ట్ ఫీచర్లు, రెట్రో డిజైన్‌తో తిరిగి రాబోతోంది.
పాత యమహా RX100 ప్రత్యేకతలు
పాత యమహా RX100 నవంబర్ 1985లో విడుదలైంది. ఇందులో 98సీసీ ఎయిర్-కూల్డ్, 2-స్ట్రోక్ ఇంజన్ అందించారు. ఇది 11.2 HP పవర్, 10.39 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కేవలం 7.5 సెకన్లలో 0 నుంచి 60 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు, అయితే దీని గరిష్ట వేగం 110 కిమీ/గం. మైలేజ్ విషయానికి వస్తే, ఈ బైక్ లీటరుకు 35-45 కిమీ సగటును ఇచ్చేది, అది ఆ కాలానికి చాలా మంచి మైలేజ్.
తేలికపాటి ఫ్రేమ్, పవర్ ఫుల్ ఇంజిన్ కారణంగా ఈ బైక్ ఆ కాలపు రైడర్‌లకు అద్భుతమైన రైడింగ్ ఎక్స్ పీరియన్స్ అందించేది. అయితే, నేటి పరిస్థితులకు అనుగుణంగా దీని మైలేజ్ కొంచెం తక్కువగా పరిగణించబడుతుంది, కానీ దీని పర్ఫామెన్స్, విశ్వసనీయత కారణంగా దీనికి ‘కల్ట్ క్లాసిక్’ హోదా లభించింది. ఇప్పుడు 2025లో, యమహా RX100 అప్‌డేటెడ్ వెర్షన్ విడుదల కానుంది. ఇది లేటెస్ట్ టెక్నాలజీ, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడుతుంది. కొత్త RX100 ఎక్కువ మైలేజ్ ఇవ్వడానికి అప్‌గ్రేడ్ చేయబడింది. నివేదికల ప్రకారం, ఈ బైక్ లీటరుకు 80 కిమీ మైలేజ్ ఇవ్వగలదు. ఇది పాత మోడల్‌తో పోలిస్తే చాలా మెరుగుదల. దీనితో ఈ బైక్ రోజువారీ వినియోగానికి సరిపోనుంది.
కొత్త RX100లో క్లాసిక్ డిజైన్‌తో పాటు ఆధునిక ఫీచర్లు జోడించనున్నారు. ఇది దాని పర్ఫామెన్స్, సేఫ్టీని పెంచనున్నారు. ఈ బైక్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ABS, LED లైటింగ్ వంటి ఆధునిక సాంకేతికత ఉంటుందని భావిస్తున్నారు. యమహా RX100 తిరిగి రావడం మోటార్‌సైకిల్ ప్రేమికులకు ఒక పెద్ద శుభవార్త. దీని క్లాసిక్ లుక్, మంచి పర్ఫామెన్స్, మెరుగైన మైలేజ్ దీనిని అద్భుతమైన ఎంపికగా మార్చగలవు. కంపెనీ ఈ బైక్‌ను ఎప్పుడు విడుదల చేస్తుందో.. దీని ధర ఎంత ఉంటుందో చూడాలి.
Also Read : మైలేజ్ ఎక్కువ ఉన్నా కొనేవారు లేరు! హోండా ఎస్‌పీ 160 వైఫల్యానికి కారణాలివే!