Homeబిజినెస్TVS Radeon : కేవలం రూ.3 వేలకే టీవీఎస్ బైక్.. ఆఫీసుకు వెళ్లడానికి బెస్ట్ ఇదే

TVS Radeon : కేవలం రూ.3 వేలకే టీవీఎస్ బైక్.. ఆఫీసుకు వెళ్లడానికి బెస్ట్ ఇదే

TVS Radeon : భారత మార్కెట్‌లో టీవీఎస్ బైక్‌లకు స్పెషల్ క్రేజ్ ఉంది. కంపెనీ బైక్‌లలో ఒకటైన టీవీఎస్ రేడియన్ నేరుగా హీరో స్ప్లెండర్ ప్లస్‌కు గట్టి పోటీని ఇస్తుంది. మీరు రోజూ ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లడానికి బెస్ట్ బైక్ కోసం చూస్తున్నట్లయితే ఈ బైక్ కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఈ టీవీఎస్ రేడియన్ బైక్ సరసమైన ధరతో పాటు మంచి మైలేజ్‌ను కూడా అందిస్తుంది. ఈ కథనంలో టీవీఎస్ ఈ బైక్ డౌన్ పేమెంట్, ఈఎంఐ, ఆన్-రోడ్ ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

Also Read : మైలేజ్ ఎక్కువ ఉన్నా కొనేవారు లేరు! హోండా ఎస్‌పీ 160 వైఫల్యానికి కారణాలివే!

బైక్ ఆన్-రోడ్ ధర ఎంత?
Bikewale వెబ్‌సైట్ ప్రకారం, ఢిల్లీలో టీవీఎస్ రేడియన్ డ్రమ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 63, 630. ఈ బైక్‌పై రూ. 5,090 ఆర్టీఓ ఛార్జీ , రూ. 6, 293 ఇన్సురెన్స్ మొత్తం వర్తిస్తుంది. దీనితో పాటు బైక్‌పై ఇతర ఛార్జీలు రూ. 2, 217 ఉంటాయి. ఈ విధంగా బైక్ మొత్తం ఆన్-రోడ్ ధర రూ. 77 వేల 230 అవుతుంది.

డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి?
ఢిల్లీలో రూ. 77, 230 ఆన్-రోడ్ ధర కలిగిన ఈ బైక్‌ను ఫైనాన్స్ చేయించుకోవడానికి మీరు డౌన్ పేమెంట్‌గా రూ. 3 వేలు చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా మీ లోన్ మొత్తం రూ. 74,230 అవుతుంది. 9 శాతం నెలవారీ వడ్డీ రేటుతో మూడేళ్ల పాటు రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 2,619 ఈఎంఐ చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు మొత్తం రూ. 94,284 చెల్లిస్తారు. ఎందుకంటే ఇందులో రూ.20వేల వడ్డీ కూడా ఉంటుంది.

టీవీఎస్ రేడియన్‌లో 109.7 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 7,350 ఆర్‌పిఎమ్ వద్ద 8.08 బిహెచ్‌పి పవర్, 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్ ఇంజన్ 4-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. టీవీఎస్ ఈ బైక్ ట్యాంక్ ఫ్యూయెల్ కెపాసిటీ 10 లీటర్లు. మైలేజ్ విషయానికి వస్తే, దీని సగటు మైలేజ్ లీటరుకు 62 కిమీలు ఇస్తుంది.

బైక్ యొక్క పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే.. దీని ముందు భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్స్, దీని టాప్ వేరియంట్‌లో 240 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. దీనితో పాటు బైక్ వెనుక చక్రానికి 110 మిమీ డ్రమ్ బ్రేక్‌ను ఉపయోగించారు. రేడియన్ 110 అన్ని వేరియంట్లలో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించారు. బైక్‌లో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది.

Also Read : 91 కిమీ మైలేజ్‌తో సంచలనం సృష్టించిన బజాజ్ ఫ్రీడమ్ 125!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular