ABS Bikes : సేఫ్టీ, స్టైలిష్ గా ఉంటూ, బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ కోసం చూస్తున్నారా.. అలాంటి వాళ్లకు గుడ్ న్యూస్. ప్రస్తుతం ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఇప్పుడు కేవలం కాస్ట్లీ బైక్‌లకే పరిమితం కాలేదు. ప్రస్తుతం అనేక బడ్జెట్-ఫ్రెండ్లీ బైక్స్ కూడా ఈ ముఖ్యమైన ఫీచర్‌తో వస్తున్నాయి. ఇది వేగంగా బ్రేక్ వేసినప్పుడు బైక్ జారిపోకుండా ఆపుతుంది. అయితే, ABS టెక్నాలజీతో వస్తున్న మనదేశంలోని 5 బెస్ట్ అత్యంత చవకైన బైక్‌ల గురించి ఈ వార్తలో తెలుసుకుందాం.
1. బజాజ్ పల్సర్ NS125
125సీసీ విభాగంలో ఇది మొదటి ABS పల్సర్. ఇందులో స్టైలిష్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, బ్లూటూత్‌తో కనెక్ట్ అయ్యే డిజిటల్ డిస్‌ప్లే, అద్భుతమైన గ్రాఫిక్స్ ఉన్నాయి. రూ.1.07 లక్షల ధరలో ఈ బైక్ సేఫ్టీతో పాటు టెక్నాలజీ, స్టైల్ రెండింటి కాంబినేషన్లో వస్తుంది.
2. బజాజ్ పల్సర్ 150
క్లాసిక్ లుక్, పవర్ ఫుల్ పర్ఫామెన్స్ కు పాపులర్ అయిన పల్సర్ 150 నేటికీ యూత్ ఫేవరెట్ బైక్. దాదాపు 20ఏళ్లుగా భారతీయ రోడ్లపై దూసుకుపోతున్న ఈ బైక్ ఇప్పుడు ABS తో మరింత సేఫ్టీగా వస్తుంది.
3. బజాజ్ పల్సర్ N150
కొత్తది, ఫ్యూచరిస్టిక్‌గా ఉండే బైక్ కావాలని అనుకున్న వాళ్లకు పల్సర్ N150 బెస్ట్ ఆప్షన్. ఇది డ్యూయల్-ఛానెల్ ABS, ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వస్తుంది. స్టైల్, టెక్నాలజీ విషయంలో ఇది ముందంజలో ఉంది.
Also Read: ABS Technology : టీవీఎస్ అపాచీ నుంచి బజాజ్ పల్సర్ వరకు ఏబీఎస్ టెక్నాలజీలో వచ్చే బడ్జెట్ బైక్స్ ఇవే
4. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్
హీరో (Hero) నుంచి వచ్చిన ఈ బైక్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత సరసమైన ABS బైక్‌గా పరిగణించబడుతోంది. గతంలో దీని ధర రూ.99,500 కాగా, ఇప్పుడు రూ.1.02 లక్షలకు పెరిగింది. లైట్ వెయిట్, ఆకట్టుకునే లుక్ ఉన్న ఈ బైక్ ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. తన విభాగంలో ఇది బజాజ్ పల్సర్ NS125 కంటే కూడా చవకైనది.
5. హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ
మంచి పర్ఫామెన్స్ 160సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ ఒక అద్భుతమైన ఆప్షన్. లైట్ వెయిట్ కావడంతో పాటు, దీని హ్యాండ్లింగ్ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. సిటీ రోడ్లకు, హైవేలకు రెండింటికీ అనుకూలమైన ఈ బైక్ మైలేజ్ విషయంలో కూడా కస్టమర్లను సాటిస్ఫై చేస్తుంది.
ABS ఎందుకు అవసరం?
ABS అంటే వేగంగా లేదా ఎమర్జెన్సీ బ్రేక్ వేసినప్పుడు టైరు లాక్ అవ్వకుండా ఆపుతుంది. దీనివల్ల బైక్ జారిపోదు. ప్రమాదం జరిగే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. భారతదేశ ప్రభుత్వం కూడా 125సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న అన్ని కొత్త బైక్‌లలో ABS ను తప్పనిసరి చేసింది.