Gold Price Today: బంగారం ధరలు మరోసారి గుడ్ న్యూస్ చెప్పాయి. రెండు రోజులుగా తగ్గిన పసిడి ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. అటు వెండి సైతం తగ్గుముఖం పడుతోంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ 2337 డాలర్లుగా నమోదైంది. స్పాట్ సిల్వర్ 30.19 డాలర్లుగా కొనసాగుతోంది. దేశీయంగా గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 20 న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,200గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,220 గా ఉంది. జూన్ 19న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,200తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర బుధవారంతో పోలిస్తే గురువారం స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,460గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,200 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,220 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,950 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,050తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,200 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,220తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,200తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,220తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు స్థిరంగా కొనసాగినా.. వెండి ధరలు పడిపోయాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.91,000గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం రూ.500 తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.91,000గా ఉంది. ముంబైలో రూ.91,000, చెన్నైలో రూ.91,100 బెంగుళూరులో 91,000, హైదరాబాద్ లో రూ. 91,100 తో విక్రయిస్తున్నారు.