Nani: బలగం వేణు కి షాక్ ఇచ్చిన నాని..హిట్ డైరెక్టర్ ను తెర మీదకు తెచ్చిన న్యాచురల్ స్టార్…

వేణు చెప్తున్న స్టోరీ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఇప్పుడు నాని పాన్ ఇండియా హీరో గా ఎదుగుతున్నప్పుడు మళ్ళీ విలేజ్ స్టోరీ లు ఏం చేస్తాం అనే ఉద్దేశ్యంతో కూడా నాని ఈ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి.

Written By: Gopi, Updated On : June 20, 2024 8:23 am

Nani

Follow us on

Nani: నాచురల్ స్టార్ నాని తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇక సినిమాల సంఖ్య పెంచుకోవడమే కాకుండా సక్సెస్ ఫుల్ సినిమాలను మాత్రమే చేయడానికి తను ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు హిట్ 3 సినిమాను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక శైలేష్ కొలన్ దర్శకత్వంలో హిట్, హిట్ 2 రెండు సినిమాలు కూడా నానినే ప్రొడ్యూస్ చేశాడు. అయితే ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇక హిట్ 3 సినిమా లో తనే హీరోగా చేయాలనుకున్న నాని హిట్ 2 సినిమా ఎండింగ్ లోనే మనకు కొత్త కేసును టేకఫ్ చేయబోతున్న హీరో తనే అని హింట్ ఇచ్చారు.

అయితే ఇప్పుడు శైలేష్ కొలన్ చేసిన సైంధవ్ సినిమా ఫ్లాప్ అయింది. కాబట్టి మరోసారి హిట్ ఫ్రాంచైజ్ ని నమ్ముకోవాలని ఆయన చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే నాని కూడా హిట్ 3 సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ‘ బలగం ‘ సినిమా దర్శకుడు ఆయన వేణు తో సినిమా చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే నాని మాత్రం వేణు రాసుకున్న కథను ఇంకా పూర్తిగా వినలేదని తన దగ్గరికి ఫైనల్ వర్షన్ రాలేదని ఆయన దగ్గర నుంచి సమాధానం వస్తుంది.

అయిన కూడా వేణు చెప్తున్న స్టోరీ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఇప్పుడు నాని పాన్ ఇండియా హీరో గా ఎదుగుతున్నప్పుడు మళ్ళీ విలేజ్ స్టోరీ లు ఏం చేస్తాం అనే ఉద్దేశ్యంతో కూడా నాని ఈ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి…కాబట్టి వేణుతో సినిమా చేసే అవకాశం లేదన్నట్టుగా నాని తన సమాధానాన్ని తెలియజేయడంతో వేణు నాని కాంబినేషన్ లో రావాల్సిన ‘యెల్లమ్మ ‘ సినిమా ఆగిపోయినట్టే..

ఇక అందుకోసమే వేణు మరొక హీరో కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే నాని హిట్ 3 సినిమాని పట్టలెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి నాని నెక్స్ట్ చేయబోయే హిట్ 3 సినిమాతో సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది…