Kalki 2898 AD: కల్కి మూవీ పై సెన్సార్ బోర్డు వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ రివ్యూ…అదొక్కటి ఎక్కువ అయిందట..

తెలుగులో కాదు హిందీ సర్టిఫికెట్ కోసం ముంబైలోని సెన్సార్ బోర్డుకి ఈ సినిమాని చూపించారనే టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఈ సినిమాని చూసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : June 20, 2024 8:19 am

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: ఈనెల 27వ తేదీన కల్కి సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని చాలా గట్టిగా నిర్వహిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని సెన్సార్ సర్టిఫికెట్ కోసం సెన్సార్ బోర్డు వాళ్లకి అయితే చూపించారట. అయితే తెలుగులో కాదు హిందీ సర్టిఫికెట్ కోసం ముంబైలోని సెన్సార్ బోర్డుకి ఈ సినిమాని చూపించారనే టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఈ సినిమాని చూసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాని చాలా సేపటి వరకు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ప్రతి షాట్ ని గమనిస్తూ వచ్చారట. ఎందుకంటే ఏదైనా రక్తపాతానికి సంబంధించిన షాట్స్ ఉంటే వాటిని కట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు ఈ సినిమాను చాలా ఎక్కువ సమయం కేటాయించి మరి చూశారట. ఇక అయినప్పటికి వాళ్లకు చాలా తక్కువ షాట్స్ మాత్రమే కట్ చేయడానికి అవకాశం దొరికిందట. ఇక సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమా మీద ఇచ్చిన రివ్యూ అయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. కానీ సెన్సార్ బోర్డు వెళ్లి చెప్పినదాని ప్రకారం చూస్తుంటే ఈ సినిమాలో కొన్ని విజువల్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదొక్కటే ఈ సినిమాను కొంచెం ఇబ్బంది పెడుతుందని చెప్తున్నారు. చూస్తున్నప్పుడు కొంచెం గ్రాఫిక్స్ వర్క్ కూడా అక్కడక్కడ తేడా కొట్టినట్టుగా కూడా వాళ్ళు చెప్పడం అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…

ఇక ఈ సినిమాలో ప్రభాస్ అటు కామెడీ చేస్తూనే, ఇటు యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా చాలా బాగా పండించారట. ఇక కమల్ హాసన్ విలనిజం అయితే సినిమాకి నెక్స్ట్ లెవెల్లో ఉంది అని చెబుతున్నారు. అలాగే దీపికా పదుకొనే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని పోషించిందని చెప్తున్నారు. ఇక అమితాబచ్చన్ అయితే నెక్స్ట్ లెవల్లో చేశాడట. ఈ ఏజ్ లో అలాంటి పాత్రని ఆయన చేస్తారని ఎవరు అనుకోరు…

ఇక ఎవ్వరూ ఊహించని ఒక డిఫరెంట్ పాత్రలో తను కనిపించాడని వాళ్ళు చెబుతూన్న విషయాలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఇక వాళ్ళు చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే ఈ సినిమా మీద ప్రేక్షకులకి విపరీతమైన అంచనాలు పెరగడమే కాకుండా సినిమా రిలీజ్ కోసం వాళ్ళు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి…