గత కొన్ని నెలలుగా పెరుగుతున్న బంగారం ధర ఎట్టకేలకు భారీగా తగ్గింది. జనవరి నెల 1వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 51,060 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 48 వేల రూపాయలుగా ఉంది. మూడు నెలల్లో పసిడి ధర ఏకంగా 3,000 రూపాయలకు పైగా తగ్గడం గమనార్హం. బంగారం ధర తగ్గడంతో కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పవచ్చు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 2,800 రూపాయలు తగ్గింది.
అయితే బంగారం ధర తగ్గినా వెండి ధర మాత్రం పెరగడం గమనార్హం. జనవరి నెల 1వ తేదీన కిలో వెండి ధర 72,400 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర 73,400 రూపాయలుగా ఉంది. గడిచిన మూడు నెలల్లో వెండి ధర ఏకంగా 1,000 రూపాయలు పెరగడం గమనార్హం. అయితే బంగారం కొనుగోలు చేయడానికి మాత్రం ఇదే సరైన తరుణమని నిపుణులు వెల్లడిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి.
రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందువల్ల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కొరకు బంగారం కొనుగోలు చేసేవాళ్లు ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, ఇతర అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయి.
భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ , ఇతర అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. గతేడాది కరోనా కేసులు పెరిగిన సమయంలో బంగారం ధరలు పెరగగా రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది