తిరుపతి: తగ్గిన పోలింగ్.. వైసీపీకి ఎసరు?

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదే కాబోలు. తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఓటింగ్ శాతం చూశాక వైసీపీ ఆందోళన మొదలైంది. దొంగ ఓట్ల కలకలం.. పార్టీలు అడ్డుకున్న తీరు చూశాక చాలా మంది ఓటు వేయడానికి వచ్చిన వారు సైతం పారిపోయిన వైనం వైసీపీకి మైనస్ గా మారిందంటున్నారు. తిరుపతిలో గత ఉప ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ తగ్గింది. ఈసారి 65 శాతం […]

Written By: NARESH, Updated On : April 18, 2021 2:02 pm
Follow us on

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదే కాబోలు. తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఓటింగ్ శాతం చూశాక వైసీపీ ఆందోళన మొదలైంది. దొంగ ఓట్ల కలకలం.. పార్టీలు అడ్డుకున్న తీరు చూశాక చాలా మంది ఓటు వేయడానికి వచ్చిన వారు సైతం పారిపోయిన వైనం వైసీపీకి మైనస్ గా మారిందంటున్నారు.

తిరుపతిలో గత ఉప ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ తగ్గింది. ఈసారి 65 శాతం నమోదు కాగా.. గతంతో పోలిస్తే ఇది 15శాతం వరకూ తక్కువ కావడం గమనార్హం. ఇంత భారీ స్థాయిలో పోలింగ్ శాతం తగ్గడం పార్టీలను షాక్ కు గురిచేస్తోంది.

ఈ సారి తిరుపతి ఉప ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. త్రిముఖ పోటీ నెలకొంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి తోడు బీజేపీ-జనసేన కూటమి సైతం ఢీ అంటే ఢీ అని ప్రచారం చేసింది. అయితే 15శాతం పోలింగ్ తగ్గడం పార్టీలను కలవరపెడుతోంది.

భారీగా పోలింగ్ నమోదైతే ఖచ్చితంగా తమకు 5 లక్షల మెజార్టీ వస్తుందని వైసీపీ మంత్రులు, నేతలు డబ్బా కొట్టారు.అయితే ఇప్పుడు 15శాతం ఓటింగ్ తగ్గడంతో వైసీపీ కొంప ముంచేలానే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు.

మొత్తం 17 లక్షల ఓటర్లలో ఈసారి 10 లక్షల మంది ఓటేశారనుకుంటే అందులో 5 లక్షల మెజార్టీ అంటే దాదాపు అసాధ్యం, టీడీపీ, బీజేపీ -జనసేన ఈసారి హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో వైసీపీ 5 లక్షల మెజార్టీ ముచ్చట ఈసారి తీరదు అంటున్నారు.

ప్రధానంగా ఓటర్లు ఈ ఉప ఎన్నికల వేళ ఎందుకు పనికిరాని ఈ సీటు కోసం ఓటు వేయడానికి ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా దీనికి స్పందన ఉండదు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటర్లు సహజంగా ఈసారి ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంటారు. పార్టీల సానుభూతిపరులు.. తీసుకొచ్చిన వారే వేస్తారు. వైసీపీని గెలిపించాలనుకునే వారికన్నా.. ఓడించాలనుకునే వారే ఎక్కువగా వచ్చి వేస్తారు. బీజేపీ , జనసేన నేతలు ఈసారి భారీగానే తరలివచ్చారు.  దీంతో ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది ఆసక్తిగా మారింది.