https://oktelugu.com/

‘ఐకాన్’ మల్లీస్టారర్.. అల్లు అర్జున్ తో పాటు !

మన హీరోల బిరుదులు భలే విచిత్రంగా ఉంటాయి. పైగా అవి ఒక్కోసారి కామెడీనూ ఉంటాయి. అలాంటి బిరుదులో ఒకటి ‘స్టైలిష్ స్టార్’… అల్లు అర్జున్ కి ఇచ్చిన బిరుదు ఇది. మరి బన్నీలో అంత గొప్ప స్టైలిష్ నెస్ ఏముందో తెలియదు గానీ, మొత్తానికి ఈ బిరుదు మాత్రం బన్నీకి చాల సంవత్సరాల పాటు ప్రత్యేకంగా నిలిచిపోయింది. అయితే, మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో గానీ, అల్లు అర్జున్ ఇటీవలే తనకున్న ‘స్టైలిష్ స్టార్’ బిరుదుని తొలగించేసుకుని, ‘ఐకాన్ […]

Written By:
  • admin
  • , Updated On : April 18, 2021 / 02:27 PM IST
    Follow us on


    మన హీరోల బిరుదులు భలే విచిత్రంగా ఉంటాయి. పైగా అవి ఒక్కోసారి కామెడీనూ ఉంటాయి. అలాంటి బిరుదులో ఒకటి ‘స్టైలిష్ స్టార్’… అల్లు అర్జున్ కి ఇచ్చిన బిరుదు ఇది. మరి బన్నీలో అంత గొప్ప స్టైలిష్ నెస్ ఏముందో తెలియదు గానీ, మొత్తానికి ఈ బిరుదు మాత్రం బన్నీకి చాల సంవత్సరాల పాటు ప్రత్యేకంగా నిలిచిపోయింది. అయితే, మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో గానీ, అల్లు అర్జున్ ఇటీవలే తనకున్న ‘స్టైలిష్ స్టార్’ బిరుదుని తొలగించేసుకుని, ‘ఐకాన్ స్టార్’ అనే కొత్త బిరుదును వెనుక తగిలించుకున్నాడు. పనిలో పనిగా ఇప్పటి నుండి తానూ ఐకాన్ స్టార్ అని అందరి చేత అనిపించుకున్నాడు కూడా.

    అసలు ఉన్నట్టు ఉండి ఎందుకయ్యా బిరుదును తొలిగించింది అంటే.. ‘స్టైలిష్ స్టార్’ అనే బిరుదులో బన్నీ నటనా చాతుర్యంకి సంబంధించిన పొగడ్త మిస్ అయిందట. మరి మహానటుడు అయ్యే.. ఆయనగారి నటనా కౌసల్యం దెబ్బతింది. అందుకే సడెన్ గా ఐకాన్ స్టార్ అని మార్చారు. ఇంతకీ ఈ బిరుదును మార్చిన ఘనుడు ఎవరయ్యా అంటే.. దర్శకుడు సుకుమార్. ఎక్కడ నుండి కాపీ కొట్టొచ్చు, పదిమంది రైటర్స్ ను పెట్టుకుని.. వారి చేత రాయించుకుని.. తానేదో క్రియేటివ్ జీనియస్ లా బిల్డప్ ఇచ్చే సుకుమార్ లాంటి కాపీ క్యాట్ ఒక బిరుదు ఇవ్వడం, ఇప్పుడు ఆ బిరుదుతోనే సినిమా చేస్తానని దిల్ రాజు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.

    అయినా ‘ఐకాన్’లో నటనకి సంబంధించి అర్థం ఏముందో సుకుమార్ కే తెలియాలి. బన్నీ నటన గొప్పది, ఆ గొప్పతనాన్ని చాటి చెప్పే బిరుదు బన్నీకి ఉండాలి అంటూ సుక్కు చెప్పిన తొక్కలో స్టేట్ మెంట్ కి కూడా అర్ధం ఎక్కడుందో సుక్కుకే తెలియాలి. ఏది ఏమైనా… ఈ కొత్త ఐకాన్ స్టార్ తో రెండేళ్ల క్రితమే ‘ఐకాన్’ అనే సినిమాను ప్రకటించాడు దిల్ రాజు. మళ్లీ ఇన్నేళ్లకి ఆ ‘ఐకాన్’ సినిమా ఉంటుంది అని తాజాగా దిల్ రాజు చెప్పుకొచ్చాడు. దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్షన్ లోనే ఈ మూవీ ఉంటుందని.. పుష్ప సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే ఐకాన్ సినిమా స్టార్ట్ చేస్తామని.. అన్నట్టు ఈ ఐకాన్ లో ఒక గెస్ట్ రోల్ కూడా ఉందని.. ఆ రోల్ లో విక్టరీ వెంకటేష్ నటించే ఛాన్స్ ఉందని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.