Gold Price Today : పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. మొన్నటి వరకు లక్ష రూపాయలు దాటిన బంగారం ధరలు ఆ తరువాత కాస్త తగ్గినట్లు కనిపించాయి. కానీ తిరిగి ఇవి మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా రూ.4 వేల వరకు పెరగడం విశేషం. ఇదిలాగే కొనసాగితే మరోసారి లక్షకు పైగా వెళ్లడం ఖాయం అని అంటున్నారు. బులియన్ మార్కెట్ ప్రకారం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. ఏప్రిల్ 11న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,450గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.95,400గా ఉంది. ఏప్రిల్ 10న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.85,600తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.1,850 పెరిగింది. వరుసగా రెండు రోజుల పాటు రూ.వెయ్యికి పైగా పెరగడం విశేషం.
Also Read : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈసారి రికార్డు స్థాయిలో.. 10 గ్రాములు ఎంతంటే?
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.95,550గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,450 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.95,400 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.87,450 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,400తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.87,450 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,400తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,450తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,400తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.1,08,000గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.4000 పెరిగింది. రెండు రోజులుగా వెండి సైతం పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.95,100గా ఉంది. ముంబైలో రూ.97,100, చెన్నైలో రూ.1,08,000 బెంగుళూరులో 97,100, హైదరాబాద్ లో రూ. 1,08,000 తో విక్రయిస్తున్నారు.
ట్రంప్ సుంకపై తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో బంగారం ధరలు మరోసారి పైకి లేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆకర్షణీయమైన పెట్టుబడిగా గోల్డ్ ను పేర్కొంటున్నారు. దీంతో చాలా మంది దీనిపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ఏ నిమిషాల్లో ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారోనని అందరూ ఎదురుచూస్తున్నారని, ఆ నిర్ణయంతో బంగారం ధరలు తారుమారు అయ్యే అవకాశాలు లేకపోలేదన్న చర్చ సాగుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరగడం ఆందోళనను రేకెత్తిస్తోంది. లక్షకు పైగా బంగారం ధరలు దాటితే కొనడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.
Also Read : బంగారం ధర రూ.56 వేలకు పడిపోతుందా? త్వరపడండి