Homeక్రీడలుక్రికెట్‌Smriti Mandhana Vs Jemimah Rodrigues: జెమీమా మార్చేసింది.. స్మృతి నుంచి కప్ లాక్కుంది!

Smriti Mandhana Vs Jemimah Rodrigues: జెమీమా మార్చేసింది.. స్మృతి నుంచి కప్ లాక్కుంది!

Smriti Mandhana Vs Jemimah Rodrigues: భారత మహిళల క్రికెట్ జట్టులో స్మృతి మందాన, జెమీమా రోడ్రిగ్స్ ప్రాణ స్నేహితులు. ఆమధ్య స్మృతి వివాహం ఆగిపోయింది. ప్రేమించినవాడు మోసం చేయడంతో స్మృతి తీవ్రమైన వేదనలో కూరుకుపోయింది. ఈ దశలో స్మృతికి జెమీమా రోడ్రిగ్స్ అండగా నిలిచింది. అంతేకాదు బిగ్ బాష్ మహిళల లీగ్ లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ వదిలేసుకుంది. దీనిని బట్టి స్మృతికి జెమీమా రోడ్రిగ్స్ ఏ స్థాయిలో ప్రయారిటీ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. మైదానంలో […]

Smriti Mandhana Vs Jemimah Rodrigues: భారత మహిళల క్రికెట్ జట్టులో స్మృతి మందాన, జెమీమా రోడ్రిగ్స్ ప్రాణ స్నేహితులు. ఆమధ్య స్మృతి వివాహం ఆగిపోయింది. ప్రేమించినవాడు మోసం చేయడంతో స్మృతి తీవ్రమైన వేదనలో కూరుకుపోయింది. ఈ దశలో స్మృతికి జెమీమా రోడ్రిగ్స్ అండగా నిలిచింది. అంతేకాదు బిగ్ బాష్ మహిళల లీగ్ లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ వదిలేసుకుంది. దీనిని బట్టి స్మృతికి జెమీమా రోడ్రిగ్స్ ఏ స్థాయిలో ప్రయారిటీ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు.

మైదానంలో స్మృతి, జెమీమా రోడ్రిగ్స్ చాలా స్నేహంగా ఉంటారు. మైదానం వెలుపల కూడా వారు అదే స్థాయిలో బంధాన్ని కొనసాగిస్తుంటారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం వీరిద్దరూ ప్రత్యర్థులు. అలాగని మైదానంలో పోటీ పడుతున్నప్పుడు ప్రత్యర్థుల మాదిరిగానే ప్రవర్తిస్తుంటారు. మ్యాచ్ ముగిసిన తర్వాత మళ్లీ యధావిధిగా స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటారు.

వీరిద్దరి స్నేహానికి సవాల్ విసురుతూ ఈసారి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ లోకి స్మృతి సారధ్యం వహిస్తున్న బెంగళూరు, జెమీమా రోడ్రిగ్స్ నాయకత్వం వహిస్తున్న ఢిల్లీ జట్టు వచ్చాయి. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించి రకరకాల చర్చలు నడిచాయి. అయితే ఇప్పుడు గురువారం ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. అందరి అంచనాలు కూడా బెంగళూరు మీదే ఉన్నాయి. ఎందుకంటే బెంగళూరు జట్టులో చాలా ప్రమాదకరమైన ప్లేయర్లు ఉన్నారు. బౌలింగ్ పరంగా.. బ్యాటింగ్ పరంగా అదరగొట్టే ప్లేయర్లు ఆ జట్టులో ఉన్నారు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ జట్టు గెలుస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి. వినిపించడం మాత్రమే కాదు క్షేత్రస్థాయిలో అదే పరిస్థితులు ఉన్నాయని ప్రఖ్యాత క్రిక్ బజ్ అనే వెబ్సైట్ పేర్కొంది.

ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల ఒపీనియన్ కోసం పోల్ నిర్వహిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఢిల్లీ జట్టుకు ట్రోఫీ గెలిచే అవకాశం 95 శాతం ఉందని, బెంగళూరు జట్టుకు ఐదు శాతం అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఇలాంటి ఓటింగ్ ప్రేక్షకుల నుంచి వస్తుందని బెంగళూరు యాజమాన్యం భావించి ఉండదు. క్రిక్ బజ్ లో కనిపిస్తున్న నివేదిక సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. ఇదే క్రమంలో చాలామంది ఢిల్లీ జట్టుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈసారి ట్రోఫీని స్మృతి నుంచి జెమీమా రోడ్రిగ్స్ లాక్కుని వెళ్తోందని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper