Rajamouli and Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఒకరు. ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ప్రస్తుతం ఆయన సినిమాలు చేసినప్పటికి వాటి మీద పెద్దగా ఫోకస్ అయితే చేయడం లేదు…రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు తన శిష్యుడు స్టార్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ (Puri Jagannadh) గురించి చాలా గొప్ప గా మాట్లాడారు. అలాగే రాజమౌళి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు… మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన బిజినెస్ మేన్ Bussiness Man) సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక అంతకు ముందే రాజమౌళి (Rajamouli) ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి కొన్ని రూల్స్ పెట్టుకొని ఒక నోట్స్ అయితే రాశారు. ఇక రాజమౌళి బిజినెస్ మేన్ సినిమా చూసి ఆ బుక్ ను చింపేశారని ఆయన చెప్పడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది…ఇక మ్యాటర్ లోకి వెళ్తే రాజమౌళి చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన సినిమా సక్సెస్ అవ్వడం ఎలా అనే విధంగా కొన్ని రూల్స్ పెట్టుకొని వాటికి అనుగుణంగానే సినిమాలు చేస్తూ ఉంటాడు.
Also Read : రాజమౌళి మహేష్ సినిమాలో ఆ ఒక్క సీన్ కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నాడా..?
ఇక పూరి జగన్నాథ్ చేసిన బిజినెస్ మేన్ సినిమా ఆ రూల్స్ కి వ్యతిరేకంగా ఉండటంతో ప్రేక్షకులకు నచ్చేట్టు గా సినిమా చేయడానికి ఈ రూల్స్ కి అసలు సంబంధం లేదు అంటూ ఆయన రాసుకున్న బుక్ ను చింపేశాడట…ఇక ఈ విషయాన్ని స్వయంగా రామ్ గోపాల్ వర్మ చెప్పడం విశేషం… ఈ ఇంటర్వ్యూ లోనే యాంకర్ రాజమౌళి గురించి చెప్పమని అడగగా ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంది..?
ఆయనకి ఒక సినిమాతో సక్సెస్ ఎలా కొట్టాలో తెలుసు అంటూ సమాధానం చెప్పాడు…నిజానికి వర్మ కి పూరి కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. పూరి వర్మను గురువుగారిలా భావించిన కూడా వాళ్ళేప్పుడు గురు శిష్యుల్లా కాకుండా మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు…ఇక రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ స్టోరీ ని అందించిన శారీ సినిమా రిలీజ్ అయినప్పటికి అది ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేకపోయింది…
ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ మాత్రం విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా పూరి గత చిత్రాల మాదిరిగా కాకుండా డిఫరెంట్ జానర్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…ఈ మూవీ తో కనక విజయం సాధిస్తే పూరి పూర్వవైభవం పొందుతాడని చెప్పడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.
Also Read : మహేష్ మూవీపై రాజమౌళి పెద్ద ప్లానింగే