Car Sales : భారతీయ లగ్జరీ కార్ల మార్కెట్‌లో టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) సంచలనం సృష్టించింది. మెర్సిడెస్-బెంజ్, BMW వంటి జర్మన్ దిగ్గజాల తర్వాత JLR ఇప్పుడు టాప్ 3లో స్థానం సంపాదించింది. గత ఆర్థిక సంవత్సరంలో 6,183 కార్లను విక్రయించి, ఆడిని నాలుగో స్థానానికి నెట్టివేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే JLR అమ్మకాలు 40 శాతం పెరిగాయి. ఈ విజయంతో JLR భారతీయ లగ్జరీ కార్ల మార్కెట్‌లో తన సత్తాను చాటింది.
Also Read : భారీగా పడిపోయిన టాటా మోటార్స్ సేల్స్.. మరి స్టాక్ పరిస్థితేంటి.. అసలు ఇలా ఎందుకు జరిగింది ?
టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) భారతీయ లగ్జరీ కార్ల మార్కెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. మెర్సిడెస్-బెంజ్, BMW వంటి జర్మన్ దిగ్గజాల తర్వాత, JLR ఇప్పుడు టాప్ 3లో స్థానం సంపాదించింది. గత ఆర్థిక సంవత్సరంలో 6,183 కార్లను విక్రయించి, ఆడిని నాలుగో స్థానానికి నెట్టివేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, JLR అమ్మకాలు 40 శాతం పెరిగాయి.
రికార్డు స్థాయి అమ్మకాలు
గత ఆర్థిక సంవత్సరం జాగ్వార్ ల్యాండ్ రోవర్ కు అత్యంత లాభదాయకంగా నిలిచింది. ఆడి ఇండియా 5,993 కార్లను మాత్రమే విక్రయించగలిగింది. మెర్సిడెస్-బెంజ్ ఇండియా 18,928 కార్లతో మొదటి స్థానంలో ఉండగా, BMW ఇండియా 15,810 కార్లతో రెండవ స్థానంలో నిలిచాయి.
ల్యాండ్ రోవర్ కు భారీ డిమాండ్
2019లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొద్దికాలం పాటు ఆడిని అధిగమించినప్పటికీ, 2020లో ఆడి తన మూడవ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. అయితే, ఈసారి జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు ల్యాండ్ రోవర్ బ్రాండ్ నుండే ఎక్కువగా ఉన్నాయి. జాగ్వార్ బ్రాండ్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి సారించింది. కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లు 2027-28లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
అత్యధికంగా అమ్ముడైన మోడళ్లు
భారతదేశంలో తయారవుతున్న రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్లకు భారీ డిమాండ్ ఉంది. 2024 మే నెలలో స్థానిక ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత అమ్మకాలు మరింత పెరిగాయి. డిఫెండర్ SUV కూడా వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
Also Read : ఒక్క నెలలోనే 30 వేల కార్ల అమ్మకాలు.. ఏ కంపెనీదో తెలుసా?