Gold Price Today: బంగారం ధరలు తగ్గిటనట్లే తగ్గి.. మరోసారి భారీ స్థాయిలో పెరిగాయి. దీంతో కొనుగోలుదారులకు షాక్ కు గురయ్యారు. మొన్నటి వరకు రూ. లక్ష దాటిన బంగారం ధరలు ఆ తరువాత కొన్ని పరిస్థితుల కారణంగా దిగుతూ వచ్చాయి. కానీ గురువారం అమాంతం పెరిగాయి. అటు వెండి ధరలు కూడా పెరగడంతో శుభకార్యాలు నిర్వహించుకునేవారు ఆందోళన చెందుతున్నారు. బులియన్ మార్కెట్ ప్రకారం గురువారం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. ఏప్రిల్ 10న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,600గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.93,380గా ఉంది. ఏప్రిల్ 9న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.82900తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర బుధవారంతో పోలిస్తే గురువారం రూ.2,700 పెరిగడం విశేషం. తగ్గినట్లే తగ్గి ఇంతలా పెరిగడంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
Read Also: చౌకగా బిస్కెట్ బంగారం.. రూ.100 కోట్లకు టెండర్!
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.93,530గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.85,600 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.93,380 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.85,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.93,380తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.85,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.93,380తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.85,600తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.93,380తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.1,04,000గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం రూ.2000 పెరిగింది. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన వెండి ధరలు ఒక్కసారిగా భారీ ఎత్తున పెరిగాయి. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.95,000గా ఉంది. ముంబైలో రూ.95,000, చెన్నైలో రూ.1,04,000 బెంగుళూరులో 95,000, హైదరాబాద్ లో రూ. 1,04,000 తో విక్రయిస్తున్నారు.
అంతర్జాతీయ కారణాల కారణంగానే బంగారం ధరలు తగ్గుముఖం పట్టి.. ఆ తరువాత మళ్లీ పెరిగినట్లు తెలుస్తోంది. త్వరలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్నందున బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గే సరికి అందరూ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు బంగారం బాధలు ఇక పోయినట్లేనని అనుకున్నారు. ఒక దశంలో రూ.55,000లకు బంగారం దిగి వస్తుందన్న ప్రచారం కూడా సాగింది. కానీ ఒక్కసారిగా రూ.2,700 పెరిగేసరికి అంతా షాక్ తింటున్నారు. దీంతో బంగారం ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని అంటున్నారు. అయితే ముదుపరులకు మాత్రం లాభాల పంట పండినట్లేనని అంటున్నారు. ఇటీవల ఎక్కువ శాతం బంగారం పై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బంగారం పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతోంది. అయితే కొనుగోలుదారులకు మాత్రం నిరాశే అని తెలుస్తోంది.