Device-Based Pricing : ఇండియాలో క్విక్ కామర్స్ (Quick Commerce) బిజినెస్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. బయటకు వెళ్లే పనిలేకుండా పది నిమిషాల్లోనే కోరుకున్న వస్తువులు ఇంటికే వస్తున్నాయి. ఈ బిజినెస్ ప్రధానంగా 10 నిమిషాల్లో డెలివరీ అనే కాన్సెప్ట్‌పై ఆధారపడి పనిచేస్తోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో జెప్టో, స్విగ్గీ లాంటివి తమ సత్తాను చాటుతున్నాయి. కానీ అవి కొన్ని వ్యూహాత్మక పద్ధతులను అనుసరిస్తున్నాయి. ప్రైజింగ్ స్ట్రాటజీ ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నాయి . అందులో భాగమే “డివైస్ బేస్డ్ ప్రైజింగ్” (Device-Based Pricing). ఈ-కామర్స్, క్విక్ కామర్స్ & ఆన్‌లైన్ సేవల కంపెనీలు వాడే కస్టమర్లు తమ ఫోన్ మోడల్‌ను బట్టి ధరలను మార్చడం ఇప్పటికే గమనించి ఉంటారు.
మొదట కంపెనీలు వినియోగదారుల కొనుగోలు సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారు తక్కువ ధరలు ఉన్న వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఐఫోన్ వాడే వినియోగదారులకు సాధారణంగా రిచ్ పీపుల్ గా పరిగణిస్తారు. వారి కొనుగోలు సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని భావిస్తుంటారు. యాప్‌లు, వెబ్‌సైట్లు “డివైస్ టైప్” (Device Type) ట్రాకింగ్ ద్వారా వినియోగదారుల కొనుగోలు శక్తిని అంచనా వేస్తాయి. ఐఫోన్ యూజర్లు ఎక్కువ ఖర్చు చేయగలుగుతారని భావించి, కొన్ని ప్రొడక్ట్స్‌పై ధరను పెంచుతారు.
డిఫరెన్షియల్ ప్రైజింగ్ (Differential Pricing)
ఒకే ప్రొడక్ట్ ఐఫోన్ యాప్‌లో రూ.300 ఉంటే, ఆండ్రాయిడ్ యాప్‌లో రూ.200 మాత్రమే ఉండొచ్చు. కొన్ని సబ్‌స్క్రిప్షన్ సేవలు (Netflix, Spotify, Zee5) ఐఫోన్ యాప్‌లో ఎక్కువ ధరకు అందిస్తాయి వాటిని తీక్షణంగా చూస్తే అర్థం అవుతుంది. ఇది Apple App Store 30శాతం కమిషన్ వసూలు చేయడం వల్ల కూడా జరుగుతుంది.
ఎక్కడ ఎక్కువగా చూస్తాం?
క్విక్ కామర్స్ (Zepto, Blinkit, Swiggy Instamart) – కొన్ని చోట్ల ధరల్లో తక్కువ తేడా ఉండొచ్చు. ఈ-కామర్స్ (Amazon, Flipkart) డివైస్, లొకేషన్ ఆధారంగా డిస్కౌంట్లు మారుతుంటాయి. సబ్‌స్క్రిప్షన్ అప్లికేషన్లు (Netflix, YouTube Premium, Spotify) iPhone వెర్షన్‌లో అధిక ధర ఉంటాయి. విమాన టిక్కెట్లు బుకింగ్, హోటల్ బుకింగ్ అప్లికేషన్లు iPhone ద్వారా చూసినప్పుడు ఎక్కువ ధర చూపించొచ్చు.
వినియోగదారులు దీనిని ఎలా ఎదుర్కోవచ్చు?
* “ఇంకాగ్నిటో మోడ్” (Incognito Mode) లో చూసి ధరను పోల్చుకోవాలి.
* వేరే డివైస్ (ల్యాప్‌టాప్, ఆండ్రాయిడ్ ఫోన్) లోనూ ధరను చెక్ చేసుకోవాలి
* డెస్క్‌టాప్ వెర్షన్ & యాప్ వెర్షన్ ధరలు పోల్చుకోవాలి.
* కూపన్లు, డిస్కౌంట్లు & క్యాష్‌బ్యాక్ ఆఫర్లను వాడుకోవాలి.
“డివైస్ బేస్డ్ ప్రైజింగ్” అనేది ఆన్‌లైన్ వ్యాపారాల్లో లభ్యమయ్యే డేటాను ఉపయోగించి ధరలను కస్టమైజ్ చేయడంలో కంపెనీల వ్యూహాత్మక భాగం. ఐఫోన్ వినియోగదారులను “హై-బడ్జెట్ కస్టమర్స్” గా చూస్తూ కంపెనీలు వారిపై ఎక్కువ ఛార్జ్ చేస్తుంటాయి. కాబట్టి, ఏదైనా ఆర్డర్ చేయడానికి ముందు వేరే డివైస్ లేదా ఇంకాగ్నిటో మోడ్‌లో కూడా ధరను పరిశీలించడం మంచిది!