Daku Maharaj Collections : సంక్రాంతి పండుగకి ప్రతీ నిర్మాత తమ సినిమాలను విడుదల చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సీజన్ సినిమాలకు ఒక పండుగ లాంటిది. యావరేజ్ గా ఉన్నా చాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతుంటాయి. ఈ సంక్రాంతికి రెండు సినిమాలకు సూపర్ హిట్ టాక్స్ రాగా, ఒక సినిమాకి ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ సూపర్ హిట్ టాక్స్ తెచ్చుకున్న చిత్రాలలో ఒకటి ‘డాకు మహారాజ్’ అయితే, డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. కానీ టికెట్ సేల్స్ దగ్గర నుండి, కలెక్షన్స్ వరకు ఎక్కడా కూడా ‘డాకు మహారాజ్’ చిత్రం ‘గేమ్ చేంజర్’ కి దరిదాపుల్లోకి కూడా రాకపోవడం ట్రేడ్ పండితులను సైతం విశ్వమయానికి గురి చేసింది. ఎందుకు ‘డాకు మహారాజ్’ పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది, అందుకు కారణాలు ఏమిటి అనేది చూద్దాం.
‘గేమ్ చేంజర్’ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 24 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అదే విధంగా డిస్ట్రిక్ట్ యాప్ లో అమ్ముడుపోయిన టికెట్స్ ని కూడా కలిపి చూస్తే మొత్తం మీద 45 లక్షల టిక్కెట్లు ఈ చిత్రానికి అమ్ముడుపోయాయి. కానీ ‘డాకు మహారాజ్’ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చినా కూడా బుక్ మై షో యాప్ లో కేవలం 12 లక్షల టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి. అంటే ‘గేమ్ చేంజర్’ లో సగం అన్నమాట. ఓవరాల్ గా డిస్ట్రిక్ట్ యాప్ లో అమ్ముడుపోయిన టికెట్స్ ని కూడా కలిపి చూస్తే 20 లక్షల టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి. ఓవరాల్ గా క్లోజింగ్ లో ఈ చిత్రానికి 78 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఏకంగా 112 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అంతే కాకుండా ‘గేమ్ చేంజర్’ చిత్రానికి నాన్ స్టాప్ గా 10 రోజులు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలకు తక్కువ కాకుండా షేర్ వసూళ్లు వస్తే, ‘డాకు మహారాజ్’ చిత్రానికి కేవలం 8 రోజులు మాత్రమే నాన్ స్టాప్ గా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇలా అన్ని విధాలుగా ఈ చిత్రం డిజాస్టర్ టాక్ వచ్చిన గేమ్ చేంజర్ కి దరిదాపుల్లోకి రాకపోవడం గమనార్హం. అందుకు ప్రధాన కారణం ఏమిటంటే జనాలు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్నే తమ ప్రధమ ఛాయస్ గా పెట్టుకోవడం, మిగిలిన రెండు సినిమాలు ఛాయస్ గా పెట్టుకోవడం వల్లే. అంతే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ లో బాలయ్య బాబు ఇమేజ్ ఏమాత్రం పెరగలేదని ఈ సినిమాతో మరోసారి రుజువు అయ్యింది. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన తర్వాత కూడా లాంగ్ రన్ లో వీక్ అవుతున్నాడు అంటే, కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ బాలయ్య సినిమాలను పట్టించుకోవడం లేదని అనుకోవాలి.