Jawa 42 Lvory Color Price In India: క్లాసిక్ లెజెండ్ Java బైక్స్ అంటే యూత్ కు యమ క్రేజ్. ఈ కంపెనీ నుంచి ఎప్పుడు ఎప్పుడు కొత్త బైక్ వస్తుందా? అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో లేటెస్ట్ గా జావా 42 ఐవరీ కలర్ ను రిలీజ్ చేసింది. ఆకర్షణీయమైన.. అట్రాక్టివ్ గా ఉండే బైక్ కావాలని కోరుకునే వారు ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు. ఎందుకంటే కొంతమంది యూత్ ఎక్కువగా రాయల్ ఎన్ఫీల్డ్ వంటి బైక్లను కోరుకుంటూ ఉంటారు. కానీ అంతకుమించి అన్నట్టు ఆకర్షణీయమైన రంగుతో ఈ కంపెనీ కొత్త బైక్ ను మార్కెట్లోకి తీసుకురావడంతో దీని గురించే చర్చించుకుంటున్నారు.
ఈ బైక్ పాస్టల్ ఐవరీ ఫినిషింగ్ ముందు, వెనక కనిపిస్తుంది. ఇంద్ర ట్యాంకుతో పాటు సైడ్ ప్యానల్ లో కూడా ఇది అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. అయితే ట్యాంకు, బైక్ బ్యాక్ బ్యాక్ సైడ్ పెండర్ పై 42 అనే అక్షరం స్టైలిష్ గా ఉంటుంది. దీన్ని చూస్తే ఇది రేసింగ్ మోటార్ లాగా కనిపిస్తుంది. పూర్తిగా క్లాసిక్ రేసింగ్ను తలపించే ఈ బైక్ బ్లాక్ కలర్ లో కూడా కనిపిస్తుంది. ఈ బైక్ కొనుగోలు చేసిన వారికి నాలుగు సంవత్సరాల పాటు లేదా 50 వేల కిలోమీటర్ల వరకు గ్యారెంటీ ఇస్తున్నట్లు జావా SD మోటార్ సైకిల్స్ యాజమాన్యం తెలిపింది. ఇందులో 294.7 సిసి ఇంజన్ అమర్చి ఉన్నది. ఇది లిక్విడ్ కూల్డ్ తో ఉండడం వల్ల ఈ ఇంజన్ 27 బిహెచ్పి పవర్ తో పాటు 26.8 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది.
ఈ బైక్ హై స్పెక్ వేరియంట్, అల్లాయ్ వీల్స్ తో పాటు వైర్ స్పోక్ రిమ్స్ కూడా ఉన్నాయి. వినియోగదారులు తమకు అనుకూలంగా బైక్ లను ఎంచుకోవచ్చు. ఇందులో డ్యూయల్ ఛానల్ ABS వంటి టెక్నాలజీని కలిగి ఉండడంతో నేటి తరం వారికి ఈ బైక్ స్మూత్ డ్రైవింగ్ అనిపిస్తుంది. అలాగే ఇందులో ఫ్యూయల్ ట్యాంక్ సిగ్నేచర్ టియర్ డ్రాప్ లుక్ లో కనిపిస్తుంది. దీని పొడవు 2,061 మిమీ, 833 వెడల్పు, 1,065 మిమీ ఎత్తు, 1,369 వీల్ బేస్ ను కలిగి ఉంది. ఈ ఫ్యూయల్ ట్యాంకులో 13.2 లీటర్ల పెట్రోల్ స్టోరేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 280 ఎంఎం ఫ్రంట్ డిస్క్, డ్యూయల్ ఛానల్ ABS తో కూడిన 240 mm వెనక డిస్క్ ఉండనుంది. దీంతో ఇవి వేగంగా ప్రయాణించినా కూడా రక్షణను ఇస్తాయి. అలాగే ఎలాంటి వైబ్రేషన్ లేకుండా డ్రైవ్ స్మూత్ గా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలోని 450 కంటే ఎక్కువగా షోరూంలో ఈ బైక్ అందుబాటులో ఉంది.