Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Movie Story: 'ధురంధర్ 2' మూవీ పూర్తి స్టోరీ ఇదే..మొదటి భాగాన్ని మించిపోయిందిగా!

Dhurandhar 2 Movie Story: ‘ధురంధర్ 2’ మూవీ పూర్తి స్టోరీ ఇదే..మొదటి భాగాన్ని మించిపోయిందిగా!

Dhurandhar 2 Movie Story: పాన్ ఇండియా లెవల్ లో మూవీ లవర్స్ అందరూ ఇప్పుడు ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈసారి తెలుగు ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఒక తెలుగు స్టార్ హీరో సినిమాకు ఎంతలా ఎదురు చూస్తారో, ఆ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. మార్చి 19 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా […]

Dhurandhar 2 Movie Story: పాన్ ఇండియా లెవల్ లో మూవీ లవర్స్ అందరూ ఇప్పుడు ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈసారి తెలుగు ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఒక తెలుగు స్టార్ హీరో సినిమాకు ఎంతలా ఎదురు చూస్తారో, ఆ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. మార్చి 19 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా వరకు బ్యాలన్స్ ఉండడం, ముంబై వీధుల్లో వేసిన సెట్స్ లో ఇప్పుడు షూటింగ్ చేసుకోవడానికి అక్కడి అధికారులు ఒప్పుకోకపోవడం తో , మార్చి 19 న విడుదల అవ్వడం కష్టమే అనే వార్త వినిపిస్తుంది. ఒక నెల రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉందట. ఎందుకంటే ఇంకా రెండు వారాల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. మార్చి నెల కూడా వచ్చేస్తోంది.

షూటింగ్ ని పూర్తి చేసి, ఎడిటింగ్ , రీ రికార్డింగ్ వర్క్ వగైరా పనులు పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ సినిమా చెప్పిన తేదికి రావడం కష్టమే అని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ‘ధురంధర్ 2’ మూవీ పూర్తి స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది. కథ విషయానికి వస్తే పాకిస్థాన్ లోని టెర్రరిజాన్ని సమూలంగా నాశనం చెయ్యడమే లక్ష్యంగా, మన ఇండియా చేపట్టిన ఆపరేషనే ధురంధర్. మొదటి భాగం ల్యారీ నగరాన్ని సొంతం చేసుకొని, పాకిస్థాన్ మొత్తాన్ని శాసించే స్థాయికి చేరుకున్న రెహమాన్ డెకాయిట్ మరణంతో సినిమా ముగుస్తుంది. ఆ తర్వాత హీరో రణవీర్ సింగ్ ల్యారీ నగరాన్ని సొంతం చేసుకోవడం. తన మామయ్య ని లాహోర్ ప్రాంతానికి ఎమ్మెల్యే ని చేయడం, తద్వారా పాకిస్థాన్ మొత్తాన్ని తన గ్రిప్ లో పెట్టుకోవడం వంటివి రెండవ భాగం లో జరుగుతుంది.

పాకిస్థాన్ ని తన కంట్రోల్ లో పెట్టుకున్న హీరో పాత్ర హంజా అలీ మజారీ, అక్కడి టెర్రరిజాన్ని ఎలా నాశనం చేశాడు అనేది చాలా ఆసక్తికరంగా చూపించబోతున్నారట మేకర్స్. అంతే కాదు సినిమా సెకండ్ హాఫ్ లో హీరో పాకిస్థాన్ కి ప్రెసిడెంట్ కూడా అవుతాడట. ఒక పాకిస్థాన్ ప్రెసిడెంట్ ఇండియా కోసం పని చేస్తే ఎలా ఉంటుంది?, ఆ ఆలోచనే అద్భుతం కదూ, ‘ధురంధర్ 2 ‘ ని ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారట. ఇక ఊహించుకోండి ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది. మొదటి భాగమే వేరే లెవెల్ అనుకుంటే, రెండవ భాగం అంతకు పది రెట్లు ఉండేలా ఉంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper