Homeబిజినెస్Nissan Gravite Launch In India 2026: నిస్సాన్‌ గ్రావైట్‌.. మార్కెట్‌లోకి కొత్త మోడల్ ప్రత్యేకతలు...

Nissan Gravite Launch In India 2026: నిస్సాన్‌ గ్రావైట్‌.. మార్కెట్‌లోకి కొత్త మోడల్ ప్రత్యేకతలు ఇవీ..

Nissan Gravite Launch In India 2026: నిస్సాన్‌ తన కొత్త సబ్‌–4 మీటర్‌ ఎంపీవీ ’గ్రావైట్‌’ను భారత్‌లో అధికారికంగా లాంచ్‌ చేసింది. రెనాల్ట్‌ ట్రైబర్‌ ప్లాట్‌ఫాం ఆధారంగా రూపొందిన ఈ మోడల్, భిన్న ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌ డిజైన్‌తో మార్కెట్‌లో పోటీ పడుతుంది. ధరలు, వేరియంట్లు నాలుగు ప్రధాన ట్రిమ్‌లు – విసియా, అసెంటా, ఎన్‌–కనెక్టా, టెక్నా (లాంచ్‌ ఎడిషన్‌తో)లో లభిస్తుంది. ఎక్స్‌–షోరూమ్‌ ధరలు రూ.5.65 లక్షల నుంచి రూ.8.93 లక్షల వరకు ఉన్నాయి. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి, […]

Nissan Gravite Launch In India 2026: నిస్సాన్‌ తన కొత్త సబ్‌–4 మీటర్‌ ఎంపీవీ ’గ్రావైట్‌’ను భారత్‌లో అధికారికంగా లాంచ్‌ చేసింది. రెనాల్ట్‌ ట్రైబర్‌ ప్లాట్‌ఫాం ఆధారంగా రూపొందిన ఈ మోడల్, భిన్న ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌ డిజైన్‌తో మార్కెట్‌లో పోటీ పడుతుంది.

ధరలు, వేరియంట్లు
నాలుగు ప్రధాన ట్రిమ్‌లు – విసియా, అసెంటా, ఎన్‌–కనెక్టా, టెక్నా (లాంచ్‌ ఎడిషన్‌తో)లో లభిస్తుంది. ఎక్స్‌–షోరూమ్‌ ధరలు రూ.5.65 లక్షల నుంచి రూ.8.93 లక్షల వరకు ఉన్నాయి. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి, మార్చి 2026 నుంచి డెలివరీలు మొదలవుతాయి.

డిజైన్‌ హైలైట్స్‌
బోల్డ్‌ హనీకాంబ్‌ గ్రిల్, ’గ్రావైట్‌’ లెటరింగ్, స్లిమ్‌ ఎల్‌ఈడీ, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ ఉన్నాయి. ముందు భాగాన్ని ఆకర్షణీయంగా మార్చాయి. 15 అంగుళాల స్టీల్‌ వీల్స్, ఎత్తైన రూఫ్‌లైన్‌ సైడ్‌ ప్రొఫైల్‌కు ప్రాక్టికల్‌ లుక్‌ ఇచ్చాయి. వెనుక ర్యాప్‌–అరౌండ్‌ ఔఉఈ టెయిల్‌లైట్లు, ఇ–షేప్‌ యాక్సెంట్స్‌ ప్రీమియం టచ్‌ను జోడించాయి.

ఇంటీరియర్‌ ఫీచర్లు
డ్యూయల్‌–టోన్‌ బ్లాక్‌–బేజ్‌ థీమ్‌తో 8–ఇంచ్‌ టచ్‌స్క్రీన్, మాన్యువల్‌ క్లైమేట్‌ కంట్రోల్, 7–ఇంచ్‌ డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, మూడు–స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌ ఉపయోగకరమైన క్యాబిన్‌ను అందిస్తాయి. ఇంజిన్, ఫీచర్లు ట్రైబర్‌తో సమానంగా ఉంటాయి.

పోర్ట్‌ఫోలియో విస్తరణకు కీలకమైన గ్రావైట్, మస్క్యులర్‌ స్టైలింగ్, ప్రీమియం ఫీల్‌తో కాంపిటీటర్లకు సవాలుగా నిలుస్తుంది.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper