Cars : భారతదేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. చాలామంది దూర ప్రయాణాలు చేయడానికి బస్సుల్లో, రైళ్లల్లో కంటే సొంత వాహనాలపైనే ప్రయాణాలు చేయాలని కోరుకుంటున్నా. ఈ క్రమంలో మిడిల్ క్లాస్ వారు అయినా సరే సొంతంగా వెహికల్ ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో సెడాన్ నుంచి SUV వరకు తమకు నచ్చిన కారును కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈమధ్య ఎక్కువగా ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే కారును మాత్రమే కొంటున్నారు. ముఖ్యంగా పెద్ద ఫ్యామిలీ అంతా కలిసి దూర ప్రయాణాలు చేయడానికి అనుగుణంగా ఉండే 7 సీటర్ కార్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో సెవెన్ సీటర్ కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?
ఇటీవల విడుదలైన కణాంకాల ప్రకారం మిగతా కార్ల కంటే సెవెన్ సీటర్ కార్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో మారుతి సుజుకి కి చెందిన ఎర్టిగా సెవెన్ సీటర్ కారు అత్యధికంగా సేల్స్ను నమోదు చేసుకుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ కారును మొత్తం 1,90,972 మంది కొనుగోలు చేశారు. ఇదే కారు గత సంవత్సరంలో 1,49,757 యూనిట్లు విక్రయాలు జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 28% వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. ఈ కారు తర్వాత మహీంద్రా కంపెనీ రెండవ స్థానంలో నిలిచింది. ఈ కంపెనీకి చెందిన ఎస్ యు వి 7 సీటర్ స్కార్పియో వివిధ వేరియంట్ల కార్లు అన్ని కలిపి 2025 ఆర్థిక సంవత్సరంలో 1, 64,842 యూనిట్ల విగ్రహాలు జరగగా.. గత ఆర్థిక సంవత్సరంలో లక్ష 1,41,462 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 17% అమ్మకాలు ఎక్కువగా అయినట్లు తెలుస్తోంది.
Also Read : మధ్యతరగతి ప్రజలకు 8లక్షల లోపు బెస్ట్ బడ్జెట్ కార్లు ఇవే!
సెవెన్ సీటర్ అమ్మకాల్లో మూడో స్థానంలో టయోటా కారు స్థానం సంపాదించుకుంది. ఈ కంపెనీకి చెందిన Cresta,Hicross కార్లు 2025 ఆర్థిక సంవత్సరంలో 1, 07,204 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత ఏడాదిలో 98,181 కార్లు విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ కంపెనీ 9% వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది.
అయితే మహేంద్ర కంపెనీకి చెందిన బొలెరో ఓవరాల్ అమ్మకాల్లో నాలుగో స్థానంలో నిలిచిన.. గత ఏడాదితో పోలిస్తే 15% తక్కువ అమ్మకాలు నమోదయినట్టు తెలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన పోలేరు 2024 ఆర్థిక సంవత్సరంలో 1,10,841 యూనిట్ల విక్రయాలు జరిగాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 94,750 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ కారు అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ మోడల్ తర్వాత మహీంద్రా కంపెనీకి చెందిన ప్రసిద్ధ కారు XUV700 కారు అయిదవ స్థానంలో నిలిచింది. ఈ కారును 2024వ సంవత్సరంలో 79,398 యూనిట్లు కొనుగోలు చేయగా.. 2025 సంవత్సరంలో 93, 082 మంది కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 17% వృద్ధి నమోదు చేసింది.
Also Read : రూ.15లక్షల లోపు పిల్లల భద్రతకు 5-స్టార్ రేటింగ్ కలిగిన కార్లు!