Safety Cars Under 15 Lakhs
Safety Cars :ప్రస్తుత కాలంలో కారు కొనాలంటే సేఫ్టీకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా, పిల్లలతో ప్రయాణించేటప్పుడు కారు సేఫ్టీ రేటింగ్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ కథనంలో రూ. 15 లక్షల లోపు లభించే పిల్లల భద్రతకు అత్యంత అనుకూలమైన 5 కార్ల గురించి తెలుసుకుందాం. ఈ కార్లు లేటెస్ట్ ఫీచర్లతో మీ పిల్లలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి.
Also Read : ఎండల్లో హాయ్ హాయ్..రూ.5000 లోపు లభించే 5 ఎయిర్ కూలర్లు!
టాటా నెక్సాన్
టాటా ఈ కారు భారతదేశపు మొట్టమొదటి 5-స్టార్ భద్రతా రేటింగ్ కలిగిన కారు. ఈ కాంపాక్ట్ SUV పెద్దల, పిల్లల విభాగాలలో 5-స్టార్ సేఫ్టీతో వస్తుంది. దీని ధర 8.99 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.
మారుతి సుజుకి డిజైర్
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ కారుకు సేఫ్టీ రేటింగ్ ఉంది. సెడాన్ విభాగంలోని ఈ కారు పెద్దలకు 5-స్టార్స్, పిల్లలకు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను పొందింది. దీని ఎక్స్-షోరూమ్ ధర 6.84 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది.
హ్యుందాయ్ వెర్నా
హ్యుందాయ్ ఈ సెడాన్ కారు పెద్దలల్లల విభాగాలలో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇది ప్రీమియం సెగ్మెంట్ కారు. దీని ప్రారంభ ధర 11.05 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్).
టాటా పంచ్
టాటా మోటార్స్ ఎంట్రీ-లెవల్ SUV కారు టాటా పంచ్ పెద్దల విభాగంలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది. పిల్లల భద్రతకు సంబంధించి దీని రేటింగ్ 4-స్టార్. ఇది దేశంలోని చౌకైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్లలో ఒకటి. దీని ధర 6.20 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.
స్కోడా కుషాక్
స్కోడా కాంపాక్ట్ SUV కుషాక్ పెద్దల, పిల్లల విభాగాలలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ కారు ధర 10.99 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారుకు ఇటీవల మంచి డిమాండ్ ఉంది.
కారులో పిల్లల సేఫ్టీ
కారు’చైల్డ్ సేఫ్టీ రేటింగ్’ విడుదల చేసినప్పుడు అది ‘చైల్డ్ సేఫ్టీ సీట్ హార్నెస్’ తో చేసిన పరీక్షలపై ఆధారపడి ఉంటుంది. పిల్లలతో కారులో ప్రయాణించేటప్పుడు వారి ఉత్తమ రక్షణ కోసం ఈ సీట్ హార్నెస్ ఉండాలి. దీని ప్రారంభ ధర సుమారు 3-4 వేల రూపాయలు.
Also Read : ఫార్చ్యూనర్ హవాకి చెక్ పెట్టనున్న ఫోక్స్ వ్యాగన్ కొత్త SUV
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Safety cars cars with 5 star rating for child safety under rs 15 lakh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com