Family Cars :ఖరీదైన కార్లు కొనడం మధ్యతరగతి ప్రజలకు ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో చిన్న కుటుంబాలు, లిమిటెడ్ బడ్జెట్ ఉన్నవారు రూ. 8 లక్షల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ 5 కార్ల వివరాలను ఈ కథనంలో చూద్దాం. ఈ కార్లలో మారుతి సుజుకి నుండి టాటా మోటార్స్ వరకు వివిధ కంపెనీల కార్లు ఉన్నాయి.
టాటా టియాగో
టాటా మోటార్స్ నుండి వచ్చిన ఈ ఎంట్రీ-లెవెల్ కారు ధర రూ. 4.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 1.2 లీటర్ ఇంజన్ ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 19.8 కి.మీ, సీఎన్‌జీ వేరియంట్ 28 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు చిన్న కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేశారు. మంచి మైలేజ్ ను అందిస్తుంది. అలాగే, మూడు రకాల ఇంధన ఎంపికలు ఉండడం వలన, వినియోగదారునికి అనుకూలంగా ఉంటుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
హ్యుందాయ్ మోటార్ ఇండియా నుండి వచ్చిన ఈ హ్యాచ్‌బ్యాక్ కారు చిన్న కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ ఇంజన్ ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 18 కి.మీ, సీఎన్‌జీ వేరియంట్ 27 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు లేటెస్ట్ ఫీచర్లతో, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. దీని వల్ల ఇది ఒక మంచి ఫ్యామిలీ వెహికల్ గా చెబుతారు. ఈ కారు ధర రూ. 5.92 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
టాటా పంచ్
టాటా మోటార్స్ నుండి వచ్చిన ఈ ఎంట్రీ-లెవెల్ ఎస్‌యూవీ కారు చిన్న కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ, ఈవీ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20 కి.మీ, సీఎన్‌జీ వేరియంట్ 27 కి.మీ మైలేజ్ ఇస్తుంది. చిన్న ఎస్యూవి కావటం వలన, ఎక్కువమంది వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు, మంచి మైలేజ్ ను కూడా అందిస్తుంది. ఈ కారు ధర రూ. 6.19 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
నిస్సాన్ మాగ్నైట్
నిస్సాన్ మాగ్నైట్ కూడా చిన్న కుటుంబాలకు అనుకూలమైన కారు. ఇందులో 1.0 లీటర్ ఇంజన్ ఉంటుంది. ఈ కారు లేటెస్ట్ డిజైన్ తో ఎట్రాక్టీవ్ గా కనిపిస్తుంది. అలాగే, మంచి మైలేజ్ ను కూడా అందిస్తుంది. ఈ కారు ధర రూ. 6.14 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది లీటరుకు 19.9 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
మారుతి స్విఫ్ట్
మారుతి సుజుకి ఇండియా నుండి వచ్చిన ఈ హ్యాచ్‌బ్యాక్ కారు అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఇందులో 1.2 లీటర్ ఇంజన్ ఉంటుంది. ఈ కారు ధర రూ. 6.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 2024లో కంపెనీ దీని నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ కారు పెట్రోల్‌పై 24 కి.మీ కంటే ఎక్కువ, సీఎన్‌జీపై 32 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. మారుతి సుజుకి కార్లు దేశంలో ఎక్కువ మంది వినియోగదారుల విశ్వాసాన్ని పొందాయి. అలాగే, ఈ కారు మంచి మైలేజ్ ను అందిస్తుంది.