Borugadda Anil Kumar : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కు వరుసగా ఎదురుదెబ్బలు తప్పడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో కూటమి నేతలపై వ్యక్తిగత కామెంట్స్ చేసేవారు. మెగా కుటుంబంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయేవారు. అటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ గత కొన్ని నెలలుగా జైలు జీవితం గడుపుతున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే మధ్యలో రకరకాల కారణాలు చెబుతూ బెయిల్ పొందిన ఆయన… కేసుల నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గతంలో తన తల్లికి అనారోగ్యం పేరుతో బెయిల్ తీసుకున్న బోరుగడ్డ.. దాని పొడిగింపు కోసం కోర్టుకు సమర్పించిన సర్టిఫికెట్ ఫేక్ అంటూ పోలీసులు ఆరోపించారు. మరోవైపు ఆయన పెట్టుకున్న కొత్త బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తేల్చడం లేదు. దీంతో బోరుగడ్డ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Also Read : నడి రోడ్డుపై కూటమి ఎమ్మెల్యేల కొట్లాట.. వైరల్ వీడియో!
* బెయిల్ విచారణ చేపట్టాలని
తాను పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు బోరుగడ్డ( boorugada Anil Kumar ). దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ విషయంలో ఏపీ హైకోర్టుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చేసింది. నకిలీ మెడికల్ సర్టిఫికెట్ పెట్టి బెయిల్ పొడిగించుకున్న వ్యవహారం తేలే వరకు.. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో బోరుగడ్డకు షాక్ తగిలినట్లు అయ్యింది. గత కొంతకాలంగా ఆయన జైలు నుంచి బయటపడే ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం కలుగజేసుకోలేదని తేల్చి చెప్పడంతో.. మరి కొన్ని రోజులపాటు జైలు జీవితం తప్పేలా లేదు.
* న్యాయమూర్తుల కీలక వ్యాఖ్యలు..
మరోవైపు సుప్రీం కోర్టులో( Supreme Court) విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. బోరుగడ్డ అనిల్ సమర్పించిన నకిలీ ధృపత్రాల ఆధారంగా బెయిల్ ఇచ్చారా? లేదా? అనే విషయం తేలకుండా రెగ్యులర్ పిటిషన్ పై విచారణ జరిపితే ఆ ప్రభావం దీని మీద పడుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెవి విశ్వనాథన్ తెలిపారు. అందుకే ఆ ధ్రువపత్రాలపై హైకోర్టు నివేదిక కోరినట్లు వెల్లడించారు. అయితే చివరిగా బోరుగడ్డ బెయిల్ పిటిషన్ పై సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి.. నిర్ణయం ప్రకటించాలని మాత్రం మరో జడ్జి జస్టిస్ నాగరత్న ఏపీ హైకోర్టును ఆదేశించారు. దీంతో త్వరలో బూరుగడ్డ వ్యవహారంపై ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బోరుగడ్డ బెయిల్ విషయంలో ఎలాంటి తీర్పులు వస్తాయో చూడాలి.
Also Read :