Dussehra bumper offers: కారుల కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ చేతిలో సరైన ఆదాయం లేక వెనుకడుగు వేస్తారు. కానీ అయితే నెలనెలా ఈఎంఐ రూపంలో చెల్లించేందుకు వీలుగా కొన్ని బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయి. అంతేకాకుండా కార్లు కొనేవారికి తక్కువ వడ్డీనే విధిస్తాయి. ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. కార్ల కంపెనీలో ఒప్పందం చేసుకున్న కొన్ని బ్యాంకులు అతి తక్కువ వడ్డీకే ఇస్తున్నాయి. దసరా నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకించి మీర వడ్డీని తగ్గించి రుణాలు ఇస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ):
బ్యాంకులన్నింటికీ రారాజుగా కొనసాగే ఎస్బీఐ లో రుణం తీసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఈ బ్యాంకులో ఎటువంటి అవసరానికైన రుణ సదుపాయం అందిస్తూ తక్కువ వడ్డీనే విధిస్తారు. అయితే కొన్ని ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కార్లు కొనేవారికి ఎస్బీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దసరా పండుగ నేపథ్యంలో ఎటువంటి ప్రాసెస్ ఫీజు లేకుండా కారు లోనుపై 8.65 శాతం నుంచి 9.70 శాతం వడ్డీని మాత్రమే విధిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర:
ఎస్బీఐ బాటలోనే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ప్రాసెస్ ఫీజును వసూలు చేయడం లేదు. వార్షిక ప్రాతిపదికన 8.70 నుంచి 13 శాతం వరకు వడ్డీ విధిస్తుంది.
యూసివో బ్యాంకు:
అతి తక్కువ వడ్డీకే లోన్లు ఇచ్చే బ్యాంకులో యూసీఐ ఒకటి. ఈ బ్యాంకు జీరో ప్రాసెసింగ్ తో ప్రతీ ఏటా 8.45 నుంచి 10.55 శాతం వడ్డీతో రుణాన్ని అందిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా:
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రాసెసింగ్ ఫీజును రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. అయితే వడ్డీ రేటు మాత్రం 8.70 నుంచి 12.10 శాతం వసూలు చేస్తున్నారు.