Best 200MP Camera Smartphones 2026: ఇప్పుడున్న పరిస్థితుల్లో మొబైల్ కొనేటప్పుడు ఫోన్ గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారితోపాటు సోషల్ మీడియా కంటెంట్ సృష్టించేవారు ప్రత్యేకంగా కెమెరా కొనుగోలు చేయకుండా మొబైల్ లోనే అధిక మెగాపిక్సల్ ఉన్న ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అలా ఇటీవల మార్కెట్లోకి వస్తున్న చాలా ఫోన్లలో 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే ఆల్ట్రా వైడ్ సెన్సార్ తో పాటు సెల్ఫీ కెమెరా కూడా అద్భుతమైన పనితీరుతో ఉంటుంది. ఇవే కాకుండా మిగతా ఫీచర్లు కూడా ఆకట్టుకునే విధంగా ఉండే ఆ ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు
2026 కొత్త సంవత్సరం సందర్భంగా చాలా మొబైల్స్ లో 200 MP మెయిన్ కెమెరాను అమర్చారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది Redmi Note. Redmi Note 15 Pro Plus మొబైల్ లో మెయిన్ గా 200 MP కెమెరాను అమర్చారు. అయితే ఇందులో కెమెరా మాత్రమే కాకుండా మిగతా ఫీచర్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 6.83 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండడంతో విజువల్స్ అద్భుతంగా ప్లే అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇందులో స్నాప్ డ్రాగన్ 7s జెన్ 4 చిప్ సెట్ ఉండనుంది. దీంతో గేమింగ్ కోరుకునే వారితో పాటు మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసే వారికి ఈ ఫోన్ ప్రత్యేకంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో 6509 mAh బ్యాటరీ ఉండడంతో పాటు దీనికి 100 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. దీనిని రూ.37,999 తో విక్రయిస్తారు.
రియల్ మీ 16 ప్రో ప్లస్ మొబైల్ లో కెమెరా 200 MP తో పనిచేస్తుంది.50 MP అల్ట్రా వైడ్ లెన్స్, 8 MP సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. ఇందులో 6.8 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండగా ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 చిప్ సెట్ అమర్చారు. 7,000 mAh బ్యాటరీ ఉండగా దీనికి 80 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిని రూ.39,999 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. Vivo కంపెనీకి చెందిన V 60 అనే మొబైల్ కూడా 200 MP మెయిన్ కెమెరాతో పనిచేస్తుంది. ఇందులో 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉండనుంది. అలాగే ఇందులో 6.77 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండగా.. ఇది 8 జిబి రామ్ తో పనిచేస్తుంది. దీనిని మార్కెట్లో రూ.30,500 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.