IDBI Chiranjeevi FD Scheme : ఐడిబిఐ బ్యాంక్ లో 444, 555,700 ఇలా వివిధ టెన్యూర్లపై అధిక వడ్డీతో సీనియర్ సిటిజెన్లకు మెచ్యూరిటీ పీరియడ్ సమయానికి అధిక రాబడి అందుతుంది. ఈ పథకంలో మీరు ఐదు లక్షల రూపాయలు జమ చేసినట్లయితే మీకు మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు అన్ని బ్యాంకులలో కూడా ఈ మధ్యకాలంలో ఫిక్స్డ్ డిపాజిట్లు పై వడ్డీ రేట్లు తగ్గిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. గతంలో రేపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండుసార్లు తగ్గించిన క్రమంలో బ్యాంకులో అన్నీ కూడా తమ బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లలో కోత విధించాయి. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం ఇప్పటికీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ లపై ఆకర్షణమైన వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఈ బ్యాంకులో సీనియర్లు అలాగే సూపర్ సీనియర్లకు మంచి వడ్డీ రేటులను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఐడిబిఐ బ్యాంకు సూపర్ సీనియర్ సిటిజనుల కోసం ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం పేరు చిరంజీవి సూపర్ సీనియర్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం. ఐడిబిఐ బ్యాంకు ఈ పథకంలో 80 ఏళ్ల వయసు దాటిన వారికి అధిక వడ్డీ రేటులను అందిస్తుంది. 80 ఏళ్ల వయసు దాటిన భారతీయ పౌరులు ఐడిబిఐ బ్యాంక్ అందిస్తున్న చిరంజీవి సూపర్ సీనియర్ సిటిజన్ ఎఫ్డి పథకానికి అర్హులు. ప్రస్తుతం ఐడిబిఐ బ్యాంక్ అందిస్తున్న ఉత్సవ్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం మాదిరిగానే చిరంజీవి ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో కూడా మీరు 444,555,700 రోజులు వంటి వివిధ మెచ్యూరిటీ కాలవ్యవధులను ఎంపిక చేసుకోవచ్చు. సూపర్ సీనియర్ సిటిజనులకు చిరంజీవి ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో 444 రోజుల కాలపరిమితికి 7.75 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఒకవేళ మీరు 555 కాలవ్యవధిని ఎంపిక చేసుకున్నట్లయితే మీకు 7.80 శాతం వడ్డీ లభిస్తుంది.
అదే మీరు 700 రోజులు కాలవ్యవధిని ఎంపిక చేసుకున్నట్లయితే మీకు 7.65 శాతం వాటి రేటు లభిస్తుంది. ఐడిబిఐ బ్యాంకు సూపర్ సీనియర్ సిటిజన్లో కోసం అందిస్తున్న చిరంజీవి ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో మీరు ఒకవేళ ఐదు లక్షల రూపాయలు 444 రోజుల మెచ్యూరిటీ కాలానికి ఎంపిక చేసుకున్నట్లయితే మీకు 7.75 శాతం వడ్డీ రేటు తో మెచ్యూరిటీ సమయానికి మీకు మొత్తం కలిపి రూ.5,46,900 అందుతుంది. ఒకవేళ మీరు 555 కాలవ్యవధిని ఎంపిక చేసుకున్నట్లయితే 7.80 శాతం ప్రకారం మీరు ఐదు లక్షల రూపాయలు మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.5,60,200 లభిస్తుంది. మీరు 700 రోజుల కాలవ్యవధిని ఎంపిక చేసుకున్నట్లయితే 7.65 వడ్డీ శాతం ప్రకారం మీకు రూ.5 లక్షల రూపాయలకు మెచ్యూరిటీ సమయానికి రూ.5,74,300 అందుతుంది.