Homeఆంధ్రప్రదేశ్‌YS Sunitha Reddy: డాక్టర్ సునీత రెడ్డి.. పులివెందుల ప్రహ్లాద.. ఈ కష్టం పగవాడికి కూడా...

YS Sunitha Reddy: డాక్టర్ సునీత రెడ్డి.. పులివెందుల ప్రహ్లాద.. ఈ కష్టం పగవాడికి కూడా రావద్దు..

YS Sunitha Reddy: కన్న తండ్రి కళ్ళముందే రక్తపు మడుగులో.. అప్పటిదాకా మాట్లాడి.. కుశల ప్రశ్నలు అడిగిన ఆయన గొంతు మూగబోయింది. వాస్తవానికి ఆయన మరణం బలవంతంగా వచ్చింది. ఆ పెనుగులాటలో ఎంత ఇబ్బంది పడ్డారో.. ఆ నెత్తుటి కత్తులు ఆయన శరీరాన్ని చీల్చివేస్తుంటే ఎంత ఇబ్బంది పడ్డారో.. పగవాడికి కూడా ఈ నరకం రావద్దు.. ఇంతటి కష్టం వైరీవర్గాన్ని కూడా దక్కొద్దు. తండ్రి చనిపోతే.. ఆ బాధను ఆమె ఇప్పటికీ మోస్తూనే ఉంది. అవమానాలను భరిస్తూనే […]

YS Sunitha Reddy: కన్న తండ్రి కళ్ళముందే రక్తపు మడుగులో.. అప్పటిదాకా మాట్లాడి.. కుశల ప్రశ్నలు అడిగిన ఆయన గొంతు మూగబోయింది. వాస్తవానికి ఆయన మరణం బలవంతంగా వచ్చింది. ఆ పెనుగులాటలో ఎంత ఇబ్బంది పడ్డారో.. ఆ నెత్తుటి కత్తులు ఆయన శరీరాన్ని చీల్చివేస్తుంటే ఎంత ఇబ్బంది పడ్డారో.. పగవాడికి కూడా ఈ నరకం రావద్దు.. ఇంతటి కష్టం వైరీవర్గాన్ని కూడా దక్కొద్దు.

తండ్రి చనిపోతే.. ఆ బాధను ఆమె ఇప్పటికీ మోస్తూనే ఉంది. అవమానాలను భరిస్తూనే ఉంది. నా తండ్రి చనిపోయాడు.. పలానా వాడు చంపేశాడు. ఇదిగో ఆధారాలు.. వేయండి శిక్ష. నా తండ్రి ఆత్మకు శాంతి కలిగేలా చేయండి.. ఇలా ఆమె నినదించని రోజు లేదు. ఎక్కని మెట్లు లేవు. దిగని గడపలు లేవు. తన తండ్రి మరణం వెనుక ఉన్న అదృశ్య శక్తులను జైలుకు పంపించాలని ఆమె కోరుతుంటే.. ఆస్తికోసం.. అంతస్తుల కోసం.. డబ్బు కోసం ఆమె చంపిందని ఉల్టా ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఇటువంటి బాధ ఏ కన్న కూతురికి రావద్దు. పైగా కళ్ళముందు తండ్రి రక్తపు మడుగులో పడి ఉంటే.. ఆ దృశ్యాన్ని చూసే దురదృష్టం ఏ కుమార్తెకు లభించవద్దు.

ఇంతటి దారుణం జరిగిన తర్వాత.. ఇంతటి ఘోరాన్ని ఆమె చూసిన తర్వాత.. దేవుడా.. ఎందుకు వేసావ్ నా తండ్రికి ఇంతటి శిక్ష.. ఎందుకు పెడుతున్నావ్ నన్ను ఇంతటి బాధ.. ఏం పాపం చేసాం.. ఏమి ఇబ్బంది పెట్టాం.. నా తండ్రి చేసిన తప్పేంటి.. నా తండ్రిని చంపిన ఆ దుర్మార్గుల భరతం ఎప్పుడు పడతావ్.. ఇలా మౌనంగా ఆమె రోధిస్తూనే ఉంది. కంట కన్నీరు పెడుతూనే ఉంది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళల్లో కన్నీరు కూడా ఇంకిపోయింది.

వైయస్ వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత.. కొద్దిరోజుల పాటు జగన్.. సాక్షి మీడియా.. వైసిపి నాయకులు సునీతకు అండగా నిలిచారు. లేని ప్రేమను నటించారు. సాక్షిలో అయితే నారా సుర రక్త చరిత్ర అంటూ తాటికాయ పరిమాణంలో అక్షరాలు రాసి.. చంద్రబాబుని హంతకుడిగా చిత్రీకరించారు. ముందుగా వివేకానంద రెడ్డి మరణాన్ని గుండెపోటుగా భావించారు. ఆ తర్వాత సాక్షి స్క్రోలింగ్ లో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఆ తర్వాత నాలుక మడత పెట్టారు. వైయస్ వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబు అంటూ విష ప్రచారం మొదలుపెట్టారు.

బట్ట కలిసి మీద వేయడంలో.. విష ప్రచారం చేయడంలో వైసిపికి ఎన్నో రికార్డులు ఉన్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి రిలయన్స్ కారణమంటూ.. రిలయన్స్ ఆస్తుల మీద దాడులు చేసింది జగన్ వర్గీయులు. అదే రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సూచించిన వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చింది కూడా జగన్. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ఇలాంటి డబుల్ స్టాండర్డ్ రాజకీయాలు జగన్ కు వెన్నతో పెట్టిన విద్య.

ఇప్పుడు సునీత రెడ్డి న్యాయం కోసం తిరుగుతోంది. సిబిఐ వివేకానంద రెడ్డి మరణం లో అసలు విషయాలను తవ్వుతోంది. ఈడి ఇందులో ఉన్న మనీలాండరింగ్ వ్యవహారాలను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కేసులో ఎన్నో దారుణాలు ఉన్నాయి. మరెన్నో చీకటి నిజాలు ఉన్నాయి. కాకపోతే ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ సునీత రెడ్డికి న్యాయం జరగడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత .. సునీత రెడ్డికి నమ్మకం కలుగుతోంది. తన తండ్రిని చంపిన వారికి జైలు శిక్ష పడుతుందని ఆమె భావిస్తోంది. కానీ ఇంతటి క్రతువులో ఆమె చేస్తున్న పోరాటం భక్త ప్రహ్లాదను తలపిస్తోంది. కాకపోతే అందులో భక్త ప్రహ్లాద తండ్రి రాక్షసుడు. ఈ కథలో తండ్రి మాత్రం రాక్షసుల చేతిలో హత్యకు గురయ్యాడు. రాక్షసులు చనిపోతే పండగ చేసుకుంటారు. రాక్షసులు మనుషులను చంపితే వాళ్ల తరఫు వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు. అచ్చం సునీత రెడ్డి లాగా.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper