7 Seater Car: 7 సీటర్ కార్లలో బెస్ట్ మోడల్స్ ఇవే.. ధర రూ.10 లక్షల లోపే..

రెనాల్ట్ కంపెనీకి చెందిన ట్రైబర్ కారు వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. 7 సీటర్ గా ఉన్న ఈ కారు మల్టీ పర్పస్ గా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమవుతుంంది. దీనిని రూ.6.3 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.8.97 లక్షల వకు విక్రయిస్తున్నారు.

Written By: Srinivas, Updated On : April 9, 2024 11:20 am

Maruthi ertiga 7 seater car

Follow us on

7 Seater Car:  కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుండడంతో కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ సమయంలో చాలా మంది తక్కువ ధరకే మంచి కారు కొనాలని చూస్తారు. రూ.5 లక్షల లోపు హ్యాచ్ బ్యాక్, కాంపాక్ట్ ఎస్ యూవీ కార్లు అందుబాటులో ఉంటాయి. కానీ మల్టీ పర్పస్ వినియోగానికి కార్లు కావాలనుకునే వారు మాత్రం అధిక ధరను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు రూ.10 లక్షల లోపే 5 నుంచి 7 సీటర్ల కార్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని కంపెనీలు సామాన్యులు సైతం కొనే విధంగా ఆకట్టుకునే డిజైన్ తో పాటు లేటేస్ట్ ఫీచర్స్ ను అమర్చి మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటి వివరాల్లోకి వెళితే..

రెనాల్ట్ ట్రైబర్:
రెనాల్ట్ కంపెనీకి చెందిన ట్రైబర్ కారు వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. 7 సీటర్ గా ఉన్న ఈ కారు మల్టీ పర్పస్ గా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమవుతుంంది. దీనిని రూ.6.3 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.8.97 లక్షల వకు విక్రయిస్తున్నారు.

మారుతి ఎర్టీగా:
7 సీటర్ కార్లలో బెస్ట్ మోడల్ గా ఎర్టీగా గురించి చెప్పుకోవచ్చు. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 102 బీహెచ్ పీ పవర్, 136.8 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని రూ.8.69 లక్షల నుంచి విక్రయిస్తున్నారు.

Citroen C3:
ప్రముఖ సిట్రియాన్ కంపెనీ 7 సీటర్ సీ3 కారును గతేడాది మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఎయిర్ క్రాస్ బేస్ మోడల్ ధర రూ.9.99 లక్షలుగా ఉంది. దీని డిజైన్ చూసి ఇంప్రెస్ కావాల్సిందే

ఎంజీ ఆస్టర్:
MG కంపెనీకి చెందిన ఆస్టర్ రెండు ఇంజిన్లను కలిగి ఉంది. ఇందులో ఒకటి 1.3 లీటర్ టర్బో చార్జ్ యూనిట్, మరొకటి 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ ఉన్నాయి. ఇందులో 80 కంటే ఎక్కువ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇది 5 వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో షైన్, సెలెక్ట్, షార్ప్ ప్రో, సావీ ప్రో వేరియంట్లు ఉన్నాయి. దీనిని రూ.9.98 లక్షల ప్రారంభ ధరకు విక్రయించనున్నారు.