Solar Eclipse 2024: 60 ఏళ్లకు ఒకసారి వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణం.. సోమవారం(ఏప్రిల్ 8న) సంభవించింది. ఇది భారత దేశంలో కనిపించలేదు. అమెరికాలో మాత్రం ఈ సుదీర్ఘ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపించింది. గ్రహణం ప్రభావంతో అమెరికా మధ్యాహ్నం చీకటైంది. అంధకారం అలుముకుంది. చంద్రుడు సూర్యుని పసుపు రంగులోకి ప్రవేశించి కింద ఉన్న భూమి మీద తన నీడను వెదజల్లుతూ, సంపూర్ణ సూర్యగ్రహణానికి కారణమయ్యాడు. గ్రహణం మొదట మెక్సికోలోని మజత్లాన్ సమీపంలో మధ్యాహ్నం 12:51 గంటలకు తీరం దాటింది. ఈ గ్రహణాన్ని చాలా మంది సముద్రతీరంలో వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు. ఈగిల్ పాస్ సమీపంలోని టెక్సాస్ అంచుకు మధ్యాహ్నం 1.10 గంటలకు చేరుకుంది. అక్కడ సరిహద్దుకు ఆనుకుని ఉన్న మెక్సికన్ నగరం పీడ్రాస్ నెగ్రస్ నుంచి కనిపించే ఎద్ద మెక్సికన్ జెండా కింద నిలబడి డజన్ల కొద్దీ ప్రజలు ఉత్సాహం ప్రదర్శించారు.
పగలే చీకటి..
సూర్య గ్రహణం కారణంగా పగటిపూట చీకట్లు కమ్ముకోవడంతో అమెరికన్లు కొంతసేపు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. ఉత్తర మెక్సికో, టెక్సాస్ మైదానాల్లో నుంచి చాలా మంది గ్రహణాన్ని వీక్షించారు. మిడ్ వెస్ట్, న్యూయార్క్ రాష్ట్రం, న్యూ ఇంగ్లాండ్ అంతటా, తూర్పు కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో కొద్దిసేపటి వరకు చీకటి అలుముకుంది.
4:28 నిమిషాలు చీకటి..
అమెరికాలో 2017లో పలు ప్రాంతాల్లో సూర్యగ్రహణంతో 2నిమిషాల 42 సెక్లపాటు సంసూర్ణ గ్రహణం కనిపించింది. తాజాగా ఏర్పడిన సూర్యగ్రహణంతో 4నిమిషాల 28 సెకన్లపాటు సూర్యగ్రహణం ఏర్పడింది. మొత్తం గ్రహణాలు 10 సెకన్ల నుంచి 7–1/2 నిమిషాల వరకు ఉంటాయని నాసా తెలిపింది.