https://oktelugu.com/

Pushpa 2 Teaser: పుష్ప 2 టీజర్ లో డైలాగ్ పెట్టకపోవడానికి కారణం అదే.!

రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా "పుష్ప 2" సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ అశేషమైన ప్రేక్షకాదరణ పొందుతుంది. ఇక ఇప్పటికే ఈ టీజర్ సోషల్ మీడియా లో పలు రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : April 9, 2024 / 11:21 AM IST

    Pushpa 2 Teaser

    Follow us on

    Pushpa 2 Teaser: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ‘ఐకాన్ స్టార్’ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ “పుష్ప” సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో తన మ్యాజిక్ ని క్రియేట్ చేశాడు. ఇక పుష్ప సినిమాతో “నేషనల్ అవార్డును” గెలుచుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ ఒక అరుదైన రికార్డ్ ను కూడా నెలకొల్పాడు… ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ జనాలంత “పుష్ప 2 ” సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురుచూసెంతలా అల్లు అర్జున్ తన మార్కును చూపించాడు.

    ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా “పుష్ప 2” సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ అశేషమైన ప్రేక్షకాదరణ పొందుతుంది. ఇక ఇప్పటికే ఈ టీజర్ సోషల్ మీడియా లో పలు రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక ఇలాంటి క్రమంలో ఈ టీజర్ లో అల్లు అర్జున్ కు ఒక్క డైలాగ్ కూడా పెట్టకపోవడానికి గల కారణం ఏంటి.? అనే దాని మీద సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక దీని వెనుక సుకుమార్ పెద్ద స్ట్రాటజీని మెయిన్ టెన్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా మీద హైప్ తీసుకురావడానికే ఈ టీజర్ ని రిలీజ్ చేశారు. అది కూడా గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ “గంగమ్మ తల్లి” గెటప్ లో ఉన్న వీడియోని రిలీజ్ చేయడం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి అంటే పుష్ప 2 సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీన్స్ హైలెట్ కాబోతున్నాయి.

    కాబట్టి ప్రేక్షకుడి మైండ్ లో ఆ గెటప్ ఆ స్వాగ్ ఎలా ఉండబోతుందో చెప్పడానికే దీనిని రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రేక్షకుడి అటెన్షన్ మొత్తం ఆ గెటప్ మీద ఉండే విధంగా చేయడానికే కేవలం యాక్షన్ స్టంట్స్ తో కూడిన విజువల్స్ ను మాత్రమే ప్రజెంట్ చేశారు. అలాగే రౌడీలను కొట్టి అల్లు అర్జున్ ముందుకు కదులుతూ సింహం ఒక్కసారి జూలు విదిల్చినట్టుగా పుష్ప ఒక్కసారి తన బాడీ మొత్తాన్ని షేక్ చేయడంతో అది చూసిన అభిమానులకే కాకుండా ప్రేక్షకులకు కూడా గుజ్ బమ్స్ వచ్చాయనే చెప్పాలి.

    ఇక ఇలాంటి మ్యానరిజమ్స్ సినిమా మీద మరింత హైప్ ని క్రియేట్ చేసేలా ఉంటాయి. కాబట్టే ఇలాంటి టైంలో డైలాగులు పెట్టి ఆ మ్యానరిజమ్స్ ని చెడగొట్టే ప్రయత్నం చేయకుండా సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ టీజర్ ని కట్ చేసినట్టుగా తెలుస్తుంది… ఇక ఇదంతా చూస్తుంటే ఆగస్టు 15వ తేదీన పుష్ప జాతర మామూలుగా ఉండేలా లేదు అనిపిస్తుంది…