https://oktelugu.com/

EMI Gold: బంగారాన్ని ఈఎంఐలో కొనే ఛాన్స్.. 6 నుంచి 24 నెలల్లో డబ్బులు చెల్లిస్తూ?

EMI Gold: దేశంలో చాలామంది బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చాలా సందర్భాల్లో బంగారం కొనుగోలు చేయడానికి సరిపడా డబ్బులు చేతిలో లేకపోవడంతో ఎక్కువమంది ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో డబ్బులు లేనివాళ్లు బంగారాన్ని ఈఎంఐ రూపంలో కొనుగోలు చేయవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ప్రముఖ జ్యువెలరీ సంస్థలు ఈ ఆఫర్ ను అందిస్తుండటం గమనార్హం. వైభవ్ జువెలరీస్ సంస్థ జువెల్ ఫినా అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుని బంగారంపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తోంది. కేవలం క్రెడిట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 25, 2021 / 09:56 AM IST
    Follow us on

    EMI Gold: దేశంలో చాలామంది బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చాలా సందర్భాల్లో బంగారం కొనుగోలు చేయడానికి సరిపడా డబ్బులు చేతిలో లేకపోవడంతో ఎక్కువమంది ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో డబ్బులు లేనివాళ్లు బంగారాన్ని ఈఎంఐ రూపంలో కొనుగోలు చేయవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ప్రముఖ జ్యువెలరీ సంస్థలు ఈ ఆఫర్ ను అందిస్తుండటం గమనార్హం.

    EMI Gold

    వైభవ్ జువెలరీస్ సంస్థ జువెల్ ఫినా అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుని బంగారంపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తోంది. కేవలం క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు మాత్రమే ఈఎంఐ ద్వారా బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈ ఆఫర్ కు అర్హత పొందాలని అనుకునే వాళ్లు వైభవ్ జ్యూవెలరీ షాప్ లో నచ్చిన బంగారం ఆభరణాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

    Also Read: కేకలు ఎందుకు వేస్తారు? అరుపులపై వెల్లడైన ఆసక్తికర విషయాలు

    ఆ తర్వాత కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఈఎంఐ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. బిల్లు మొత్తంలో మొదట 6.5 శాతం చెల్లించాల్సి ఉండగా మిగతా మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు బిల్లు లక్ష రూపాయలు అయితే మొదట 6,500 రూపాయలు చెల్లించి తర్వాత నెలకు 17,450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని డాక్యుమెంట్లను అందించడం ద్వారా ఈఎంఐ ఫెసిలిటీ కొరకు అర్హత పొందవచ్చు.

    అయితే అందరూ ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా బంగారం కొనుగోలు చేయడం సాధ్యం కాదని నియమనిబంధనల ఆధారంగా ఎంపిక చేసిన కస్టమర్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందే అవకాశాన్ని ఇస్తారని సమాచారం.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలో 31 ఉద్యోగాలు!