Siva Shankar Master: కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్ కు క‌రోనా పాజిటివ్ … విషమంగా ఆరోగ్యం

Siva Shankar Master: కరోనా వైరస్ ఇంకా ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. వ్యాధి తీవ్రతతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వివిధ దేశాల్లో మరోమారు పంజా విసిరేందుకు సిద్ధమైంది. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో రోజు రోజు కరోనా మహమ్మారి కేసులు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ప్ర‌ముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్ కూడా కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజుల క్రితం శివ […]

Written By: Sekhar Katiki, Updated On : November 25, 2021 12:47 pm
Follow us on

Siva Shankar Master: కరోనా వైరస్ ఇంకా ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. వ్యాధి తీవ్రతతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వివిధ దేశాల్లో మరోమారు పంజా విసిరేందుకు సిద్ధమైంది. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో రోజు రోజు కరోనా మహమ్మారి కేసులు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ప్ర‌ముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్ కూడా కరోనా బారిన పడ్డారు.

Siva Shankar Master

కొద్ది రోజుల క్రితం శివ శంకర్ మాస్టర్ కు కరోన సోకగా తాజాగా ఆయనను హైద‌రాబాద్ న‌గ‌రం లోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చేర్చారు. శివ శంక‌ర్ మాస్ట‌ర్ తో పాటు ఆయ‌న భార్య‌కు, పెద్ద కుమారుడికి కూడా క‌రోనా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆయ‌న భార్య హోం క్వారంటైన్ లో ఉండ‌గా… కుమారుడు మాత్రం అప‌స్మార‌క స్థితిలో ఉన్న‌ట్టు సమాచారం. శివశంక‌ర్ మాస్ట‌ర్ ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన పరిస్తితి విషమంగా ఉన్నట్లు వైద్యలు వెల్లడించారు. తెలుగు, త‌మిళం, హింది తో పాటు మొత్తం ప‌ది భాష‌ల సినిమాల‌కు శివ శంకర్ మాస్టర్ కొరియో గ్రాఫ‌ర్ గా ప‌ని చేశారు. అలానే తెలుగులో పలు డాన్స్ షో లకు జడ్జి గా కూడా వ్యవహరించారు.

Also Read: కమల్​ ఆరోగ్య పరిస్థితిపై శ్రుతిహాసన్​ లేటెస్ట్​ ట్వీట్

కాగా ఇటీవల ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి, లోక నాయకుడు కమల్ హాసన్ కూడా కరోన బ్వ్బారిన పడిన విషయం తెలిసిందే. అయితే వీరంతా క్షేమంగా తిరిగి ఇంటికి కేరాలని వారి వారి అభిమానులు కోరుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.

Also Read: సింగర్​ హరిణి తండ్రి అనుమానస్పద మృతి.. అసలు ఏం జరిగింది?