
కియారా అద్వానీ సడెన్ గా స్టార్ హీరోయిన్ అయిపోయిన అందాల భామ. ఆ మధ్యే ఓ మ్యాగజైన్ కోసం నగ్నంగా పోజిచ్చి డబ్బు కోసం తానూ ఏమైనా చేస్తాను అని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పిన బోల్డ్ బ్యూటీ. ఇక ఈ భామ తాజాగా తన వైఖరితో మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిన్న కియారా, బాలీవుడ్ నటుడు సిద్దార్థ మల్హోత్రా ఇంటికి చాటుగా వెళ్లింది.
ఎందుకు వెళ్ళింది ? అని అడగొద్దు. ఎందుకంటే కియారాకి ఇలా హీరోల ఇంటికి వెళ్లడం అలవాటే అని నెటిజన్లు అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంత హీరోయిన్ అయితే మాత్రం.. ఇలా పర్సనల్ గా హీరోల ఇంటికి ఎందుకు వెళ్తుంది ? కియారా పబ్లిక్ గా బరితెగిస్తోంది అంటూ ఆమెను ట్రోల్ చేసున్నారు బాలీవుడ్ నెట్టింటి జనం. అయినా ఒక హీరోయిన్, హీరో ఇంటికి వెళ్తే ఇలా తప్పుగా ట్రోల్ చేయడం నిజంగా బాధాకరమైన విషయమే.
అయితే పెద్దవారి పట్ల కియారా బిహేవియర్ పై కూడా బాగా విమర్శలు వస్తున్నాయి. కియారా కారు సిద్దార్థ మల్హోత్రా ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఒక ముసలాడు హడావిడిగా వచ్చి కారు డోరు తీసాడు. పైగా ఆ వృద్ధుడు ఆమెకు సెల్యూట్ కూడా చేశాడు. కానీ కియారా మాత్రం అతన్ని పటించుకోలేదు. తాపీగా కారు నుంచి దిగి తన హీరోగారి ఇంటి లోపలికి వడివడిగా నడుచుకుంటూ పోయింది.
కియారా ఆ పెద్దాయన్ని పట్టించుకోకుండా వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కియారా మీద మండిపడుతూ ‘కారు డోరు కూడా తీసుకోవడం చేతకాదా నీకు ? పెద్ద ఎద్దులా ఉన్నావ్ ? అంటూ సీరియస్ అవుతున్నారు. అయినా సెలబ్రిటీలు ఇలా వయసు మీద పడ్డ ముసలి వాళ్లతో ఇలాంటి పనులు చేయించుకోవడం మన సమాజ దౌర్బాగ్యం అనుకోవాలి.