Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 5 Telugu: నామినేషన్ నుండి బయటపడిన కంటెస్టెంట్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే...

Bigg Boss 5 Telugu: నామినేషన్ నుండి బయటపడిన కంటెస్టెంట్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే…

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్ ఒక గోల్డెన్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ వారం నామినేషన్స్ లో కెప్టెన్ యాంకర్ రవి మినహాయించి మిగతా హౌస్ మేట్స్ అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. మరి పదకొండో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం పెద్ద ఆసక్తి కలిగిస్తుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ పదకొండో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ దుమారమే రేపుతోంది. ఎందుకంటే ఇప్పటికే […]

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్ ఒక గోల్డెన్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ వారం నామినేషన్స్ లో కెప్టెన్ యాంకర్ రవి మినహాయించి మిగతా హౌస్ మేట్స్ అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. మరి పదకొండో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం పెద్ద ఆసక్తి కలిగిస్తుంది.

ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ పదకొండో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ దుమారమే రేపుతోంది. ఎందుకంటే ఇప్పటికే బిగ్ బాస్ నుండి పది మంది కంటెస్టెంట్లు (సరయు, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వర్మ, ప్రియా, లోబో, విశ్వ, జెస్సీ ) ఎలిమినేట్ అయ్యారు. మరి పదకొండో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే లేపుతుంది. షన్ను, సన్నీ, మానస్, కాజల్, సిరి, ప్రియాంకా సింగ్, శ్రీరామచంద్ర, అని మాస్టర్ నామినేట్ అయ్యారు.

ఈ క్రమంలో బిగ్ బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనే టాస్క్ ఇస్తాడు. నిప్పులే శ్వాసగా … గుండెలో ఆశగా అంటూ టాస్క్ ని మొదలు పెడతారు హౌస్ మేట్స్. ఈ క్రమంలో ఎవరు ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుస్తారు అనే విషయం సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతోంది. అయితే తాజాగా జరుగుతున్న లీకుల ప్రకారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని సన్నీ గెలుచుకున్నట్లు తెలుస్తుంది. అయితే సన్నీ ఈ వారం నామినేషన్స్ నుండి తప్పించుకుని సేవ్ అయ్యినట్లు అయితే గేమ్ చేంజ్ అవుతుంది. మరి ఏం జరగబోతుందో చూడాలంటే ఇవ్వాళ జరిగే ఎపిసోడ్ ని ఖచ్చితంగా చూడాల్సిందే..

NVN Ravali
NVN Ravali
Ravali is a Entertainment Content Writer, She Writes Articles on Entertainment and TV Shows.

Related News

Most Popular

Oktelugu Epaper