Balakrishna Wedding Card: అదేంటో గానీ.. బాలయ్య వయసు పెరుగుతున్నా కొద్దీ మరింత జోష్ లో కనిపిస్తున్నాడు. ఫుల్ స్వింగ్ లో మూవీలను లైన్ లో పెట్టేస్తున్నాడు. అఖండతో కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు బాలకృష్ణ. ఇదే ఊపులో వరుసగా పెద్ద మూవీలను ఓకే చేశాడు. అఖండతో నందమూరి అభిమానుల కలను కూడా తీర్చేశాడు. ఈ మూవీ ఏకంగా వందకోట్ల మార్కును క్రాస్ చేసింది.
BalaKrishna, Vasundhara, NTR
ఇక ఇప్పుడు యాక్షన్ సినిమాల డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ మాస్ మూవీని తీస్తున్నాడు. దీని తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. అటు ఆహా షోతో కూడా ఫుల్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. ఇక త్వరలోనే నటసింహం వారసుడు మోక్షజ్ఞ త్వరలోనే వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. అతని కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Also Read: డేనియల్ శేఖర్ భార్య ఎవరో తెలుసా?
అయితే ఈ ఏడాదిలోని డిసెంబర్ 8వ తారీఖు వరకు బాలకృష్ణకు అలాగే వసుందరకు పెండ్లి జరిగి దాదాపు 40ఏండ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బాలకృష్ణ పెండ్లికి సంబంధించిన శుభలేఖ విపరీతంగా వైరల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీన్ని చూస్తుంటే నవంబర్ 22న ప్రచురించినట్టు తెలుస్తోంది. అయితే ఇది బాలకృష్ణ తరఫున వేయించింది కాదండోయ్.
Balakrishna Wife Vasundhara
ఆయన భార్య వసుందర కుటుంబీకులు దీన్ని ముద్రించారు. కాకినాడకు చెందినటువంటి దేవరపల్లి సూర్యారావు– ప్రమీలారాణిల రెండో కూతురు వసుంధర. డిసెంబర్ 8న మధ్యాహ్నం 12.41 నిమిషాలకు పెండ్లి ముహూర్తాన్ని ఇందులో ఉంచారు. అయితే ఈ వివాహం తిరుపతిలోని తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న కర్నాటక కల్యాణ మండపంలో నిర్వహించినట్టు ఇందులో స్థలాన్ని పేర్కొన్నారు.
అయితే వసుంధర తండ్రి సూర్యారావు శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. వీరిది కూడా చాలా బలమైన కుటుంబం. అయితే బాలయ్య పెండ్లి బాధ్యతను నాదెండ్ల భాస్కరరావుకు అప్పగించగా.. ఆయనే వసుంధర సంబంధాన్ని ఖాయం చేశారంట. అప్పటికే బాలయ్య స్టార్ హీరోగా ఉన్నారు.
Also Read: బాక్సాఫీస్ బద్దలు.. భీమ్లానాయక్ 4వ రోజు కలెక్షన్స్ షాకింగ్
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Balakrishna wedding card viral in social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com