Bala Krishna: నందమూరి బాలకృష్ణ… ఆ ఒక్క పేరు చాలు థియేటర్లు ఫుల్ అవ్వడానికి అంటే అతిశయోక్తి కాదు. మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ తో వెండితెరపై దుమ్ముదులిపే నందమూరి నటసింహం. ఈ సారి రూట్ మర్ఛి సరికొత్త అవతారంతో ఓటిటీ లో అలరించేందుకు రెడీ అయ్యాడు. ఆహా సంస్థ నందమూరి బాలయ్య తో ” అన్ స్టాపబుల్ ” టాక్ షో ను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో నుంచి తాజాగా ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.
తాజాగా ఈ షో కు సంబంధించిన ప్రోమో విడుదల చేసింది ఈ సంస్థ అహ. ” మాటల్లో ఫిల్టర్ ఉండదు, సరదా లో స్టాప్ ఉండదు… సై అంటే సై, నై అంటే నై, దెబ్బకు థింకింగ్ మారిపోవాలా ” అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగులు ఈ ప్రోమోని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయని చెప్పాలి. ముఖ్యంగా బాలయ్య బాబు స్టయిల్, ఆ విజువల్స్ అయితే వర్ణనాతీతం అనే చెప్పాలి. ముఖ్యంగా ప్రోమో చివర్లో ” వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరి రిపిట్స్ ” అని చెప్పే డైలాగ్ అయితే ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
Maatallo filter undadu, Saradalo stop undadu, Sye ante sye, Nye ante nye 😎
Debbaku thinking maaripovala! #UnstoppableWithNBK episode 1 premieres November 4th.Promo Out Now 💥💥#NandamuriBalakrishna #MansionHouse @swargaseema #NandGokulGhee pic.twitter.com/WdgALLWF7L
— ahavideoin (@ahavideoIN) October 27, 2021
కాగా ఈ షో తొలి ఎపిసోడ్ వచ్చే నెల 4 వ తేదీన ఆహా లో ప్రసారం కానుంది. ఈ కారక్రమంలో మొత్తం 12 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రోమో అదిరి పోవడంతో .. ఈ షో ఎలా ఉండబోతుంది…? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే షో కు మొదటి గెస్ట్ ఎవరనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ మోహన్ బాబు ఈ షో లో పాల్గొంటున్నట్లు పలు ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Bala krihsna unstoppable talk show promo released
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com