Nandamuri Balakrishna: ప్రతీ సెలబ్రిటీ కెరీర్ లోనూ ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. దాని వల్ల ఆ సెలబ్రిటీ జీవితమే మారిపోతుంది. మన టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల విషయంలోనూ, అదే విధంగా రాజకీయ నాయకుల విషయంలోనూ ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చూసాము. అలా నందమూరి బాలకృష్ణ కెరీర్ ని మలుపు తిప్పిన టర్నింగ్ పాయింట్ గా ‘అఖండ’ చిత్రం నిల్చింది. ఈ సినిమాకి ముందు బాలయ్య కెరీర్ ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ ఆయన సినిమాల్లోని సన్నివేశాలను కామెడీ చేయడానికి ఉపయోగించేవాళ్ళు. అలాంటి స్థాయి నుండి నేడు అపజయం అనేదే ఎరుగని హీరోగా సీనియర్ హీరోలలో బాలయ్య ప్రస్థానం కొనసాగుతుంది. ‘అఖండ’, ‘వీరసింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ ఇలా ఆయన చేసిన ప్రతీ సినిమా సక్సెస్ అయ్యింది. వీటితో పాటు ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అయ్యే ‘అన్ స్టాపబుల్’ షో కూడా బాలయ్య ని యూత్ ఆడియన్స్ కి మరింత దగ్గర చేసింది.
అయితే ఆయన సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన తర్వాత ఎంత సంపాదించాడు, ఏమిటి అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అఖండ చిత్రానికి ముందుగా అప్పట్లో 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ కి అగ్రిమెంట్ జరిగిందట. కానీ సినిమా హిట్టై భారీ వసూళ్లు రావడంతో నిర్మాత 12 కోట్ల రూపాయిలు ఇచ్చాడట. ఇక ఆ తర్వాత విడుదలైన ‘వీరసింహా రెడ్డి’ చిత్రానికి అదే 12 కోట్లు తీసుకున్న బాలయ్య, ‘భగవంత్ కేసరి’ చిత్రానికి 18 కోట్లు, అదే విధంగా రీసెంట్ గా విడుదలైన ‘డాకు మహారాజ్’ చిత్రానికి 27 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ నాలుగు సినిమాల ద్వారా ఆయన 69 కోట్ల రూపాయిలు సంపాదించాడు.
ఇది కాకుండా ‘అన్ స్టాపబుల్’ షో ద్వారా ఆయన మరో 40 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడట. అంటే ఒక్కో సీజన్ కి 10 కోట్ల రూపాయిలు అన్నమాట. మొత్తం మీద ఆయన నాలుగేళ్ల సంపాదన 109 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. అదే విధంగా త్వరలోనే ఆయన ‘అఖండ 2 ‘ చేయబోతున్నాడు. ఈ సినిమాకి ఆయన ఏకంగా 40 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడట. అంటే రౌండ్ ఫిగర్ చేస్తే ఆయన సంపాదన 150 కోట్ల రూపాయలకు చేరింది. ఇవి మాత్రమే కాకుండా రీసెంట్ గా ఆయన అనేక బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వాటి ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నాడు. ఇలా గత నాలుగేళ్లుగా బాలయ్య బాబు కి శుక్ర మహర్దశ నడుస్తుంది. రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఏ రేంజ్ కి వేళ్తాడో చూడాలి.