Junior NTR: ప్రముఖ సీనియర్ నటుడు చలపతి రావు పేరు తెలియని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. ఎన్టీఆర్ కాలం నుండి నేటి జెనెరేషన్ స్టార్ హీరోల కాలం వరకు ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. అలా ఆయన కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్న సమయంలోనే తన కొడుకు రవిబాబు(Ravibabu) ని ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు. చూసేందుకు ఆరు అడుగుల ఎత్తు, మంచి కటౌట్ ఉండడంతో ముందుగా ఆయన్ని హీరో చేయాలని అనుకున్నాడు. మొదటి సినిమాతో హీరోగానే ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు రవి బాబు. కానీ ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో కొంతకాలం గ్యాప్ ఇచ్చి విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన రీ ఎంట్రీ కి మాత్రం రెస్పాన్స్ అదిరిపోయింది. కేవలం విలన్ రోల్స్ మాత్రమే కాకుండా, కామెడీ విలన్ గా కూడా ఆయన పాపులర్ అయ్యాడు.
అలా నటుడిగా తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్న రవి బాబు,, దర్శకుడిగా కూడా ప్రేక్షకుల్లో తనదైన ముద్రని వేసుకున్నాడు. అల్లరి చిత్రం తో దర్శకుడిగా మారిన ఆయన అమరావతి, అవును, అనసూయ, నువ్విలా ఇలా ఒక్కటా రెండా ఎన్నో వైవిద్యభరితమైన సినిమాలను తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు. రవిబాబు దర్శకత్వం వహించిన సినిమా థియేటర్స్ లో విడుదల అవుతుందంటే, కచ్చితంగా వెళ్లి చూడాలి అనే ఆడియన్స్ ఆయనకీ ఉన్నారు. అంతేకాకుండా రవిబాబు ఇంటర్వ్యూస్ కి కూడా యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. మనసులో ఉన్న మాటలను ఎలాంటి ఫిల్టర్ లేకుండా ముక్కుసూటితనంతో ఆయన మాట్లాడే మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంటాయి. అలా ఒకరోజు ఆయన ‘అతని పక్కన నేను నటించాలా?, నా భుజం దగ్గరకి వస్తాడు అతను, నేను నటించను, కావాలంటే ఎక్కువ డబ్బులు ఇవ్వండి, అప్పుడు నటిస్తాను’ అని చెప్పుకొచ్చాడు.
దీనిని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ని ఉద్దేశించి అన్నాడని, గతంలో వీళ్లిద్దరు కలిసి సింహాద్రి చిత్రంలో నటించారని, రవిబాబు కచ్చితంగా ఆ సినిమాని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసాడని ప్రచారం చేసారు. దీనిపై రవిబాబు స్పందిస్తూ, తాను ఎన్టీఆర్ ని ఉద్దేశించి అందలేదని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఆరోజు నేను అశుతోష్ రానా(Ashutosh Rana) ని ఉద్దేశించి ఆ కామెంట్ చేశాను. అతని పక్కన నన్ను నటించమంటే, అతను నా భుజాల దగ్గరకు వస్తాడు, కనీసం తెలుగు మాట్లాడడం కూడా రాదు, అతని పక్కన నటించడం నా వల్ల కాదు, ఎక్కువ డబ్బులు ఇవ్వండి అప్పుడు ఆలోచిస్తా అని అన్నాను, ఆ తర్వాత దర్శక నిర్మాతలు బ్రతిమిలాడడంతో ఆ చిత్రాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు రవిబాబు. దీంతో ఆ కాంట్రవర్సి కి తెరపడింది.