Whats App: Technology రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి రంగంలో టెక్నాలజీ విస్తరించడంతో అందరూ దీనికి అలవాటు అవుతున్నారు. ఇప్పుడు టెక్నాలజీలో భాగంగా Artificial intelligence అందుబాటులోకి రావడంతో కావలసిన సౌకర్యాలు చేతిలోనే ఉంటున్నాయి. ఏఐ ద్వారా కొందరు తమ పనులను ఈజీగా చేసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థలో పనిచేసేవారు తమకు కావాల్సిన సమాచారాన్ని ఏఐ ద్వారా తెప్పించుకుంటున్నారు. అయితే తాజాగా అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయని నిపుణులు అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో భాగంగా వాట్సాప్ లోని ఓ గ్రూపు ద్వారా వ్యక్తులు ఎవరైనా తమకు కావలసిన వైద్య సలహాలను ఉచితంగా వీటి ద్వారా పొందవచ్చని అంటున్నారు. ఇందుకోసం ఏం చేయాలంటే?
భవిష్యత్తు అంతా Artificial intelligence ఉంటుందని కొన్ని ప్రభుత్వాలు సైతం ప్రకటిస్తున్నాయి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సైతం ఇప్పటినుంచే ఏ ఐపై అవగాహన కలిగిస్తున్నారు. భవిష్యత్తులో ఏఐ రోబోలు ఉద్యోగాలు చేస్తాయి అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే తాజాగా గ్రూపు ద్వారా ఉచితంగా కావాల్సిన వైద్య సలహాలను పొందవచ్చు. సాధారణంగా ఏదైనా వైద్యుడి వద్దకు వెళితే వ్యక్తులకు కావలసిన సమస్యలు తెలుసుకొని వాటి నివారణకు మెడిసిన్ రాస్తూ ఉంటారు. కానీ ఇవే సమస్యలు ఇప్పుడు ఏఐకి చెప్పడం వల్ల దానికి సొల్యూషన్ ఏంటో రిప్లై ఇస్తుంది.
ఇప్పుడు వాట్సాప్ ఏఐ ద్వారా కావాల్సిన వైద్య సలహాలను ఉచితంగా పొందవచ్చు. August AI అని వాట్సప్ సర్చ్ బాక్స్ లో టైప్ చేయడం వల్ల ఒక గ్రూపు వస్తుంది. ఈ గ్రూపులో ఉచిత వైద్య సలహాలు అందిస్తూ ఉంటారు. ఇందులో డాక్టర్ priస్క్రిప్షన్ కూడా ఫోటో తీసి సెండ్ చేయడం వల్ల అందులో డాక్టర్ ఏం రాశాడో? ఇది తెలుపుతుంది. అలాగే మనకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దానికి సంబంధించిన మెసేజ్ ఇస్తే అందుకు ఏం చేయాలో? కూడా ఇది తెలుపుతుంది.
చాలామందికి తమ ఆరోగ్య సమస్యల గురించి ఆంగ్లంలో చెప్పడం రాదు. ఇలాంటివారు వాయిస్ ద్వారా తెలుగులో అయినా చెప్పి వాయిస్ రికార్డును సెండ్ చేయడం ద్వారా ఇది తీసుకొని దానికి రిప్లై ఇస్తూ ఉంటుంది. ఇక చేతికి ఏదైనా గాయం అయితే దానికి సంబంధించిన ఫోటో తీసి ఇందులో సెండ్ చేసిన అందుకు ఎలాంటి మెడిసిన్ వాడాలో కూడా తెలుపుతుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయినా దీని ద్వారా ఉచితంగా పొందవచ్చు.
అయితే ఇవి చిన్న చిన్న ఆరోగ్య సమస్యల వరకు మాత్రమే. దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఇతర జబ్బులకు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి వాయిస్ క్లియర్ లేకపోవడం వల్ల కూడా సరైన మెడిసిన్ ను ఏఐ అందించలేక పోతుంది. అందువల్ల ప్రాథమికంగా అవగాహన కోసం మాత్రమే దీనిని ఉపయోగించుకోవాలి. అయితే చాలామంది దీనిపై ఆధారపడాలని అనుకుంటారు. కానీ వైద్యులను సంప్రదించాల్సి వస్తే దీనిని పక్కన పెట్టి డాక్టర్లను సంప్రదించాలి.