Balakrishna(6)
Balakrishna: నట సింహం బాలకృష్ణ కెరీర్ ఊపందుకుంది. అఖండ విడుదలకు ముందు బాలకృష్ణ వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డారు. కనీసం పది కోట్ల వసూళ్లు కూడా కష్టం అన్నట్లు పరిస్థితి తయారైంది. బాలకృష్ణ మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. ఈ తరుణంలో బాలయ్యకు అచొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను.. అఖండ తెరకెక్కించాడు. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన అఖండ భారీ విజయం సాధించింది.
అఖండతో బాలకృష్ణ హిట్ ట్రాక్ ఎక్కారు. అనంతరం ఆయన నటించిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సైతం హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 చేస్తున్నారు. బోయపాటి శ్రీనుతో ఇది బాలయ్యకు నాలుగో చిత్రం. అఖండ 2 ప్రకటనతోనే అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉండగా బాలకృష్ణ ఓ స్టార్ హీరో మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు అనేది తాజా న్యూస్. ఆ స్టార్ ఎవరో కాదు రజినీకాంత్.
రజినీకాంత్ కి కమ్ బ్యాక్ ఇచ్చిన చిత్రం జైలర్. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. జైలర్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది. తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించింది. ఈ క్రమంలో జైలర్ 2కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా జైలర్ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ గెస్ట్ రోల్స్ చేశారు. వారిద్దరి సీన్స్ చాలా పవర్ఫుల్ గా నెల్సన్ డిజైన్ చేశాడు.
కాగా జైలర్ మూవీలో గెస్ట్ రోల్ కొరకు బాలకృష్ణను అనుకున్నారట. కారణం తెలియదు కానీ కుదర్లేదు. జైలర్ 2లో బాలకృష్ణ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం ఖాయమేనట. దర్శకుడు నెల్సన్ ఈ మేరకు బాలకృష్ణను సంప్రదించాడట. బాలకృష్ణ అంగీకారం తెలిపాడనేది తాజా న్యూస్. మరి ఇదే నిజమైతే జైలర్ 2 పై తెలుగులో అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి.
కాగా చిరంజీవి, మోహన్ బాబు వంటి నటులతో రజినీకాంత్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఆయన బాలకృష్ణతో కలిసి నటించలేదు. కెరీర్లో ఫస్ట్ టైం వీరిద్దరూ జైలర్ 2లో నటించబోతున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది . ప్రస్తుతం రజినీకాంత్.. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలి మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో నాగార్జున కీలక రోల్ చేయడం విశేషం.
Web Title: Balakrishna is sure to make a guest appearance in jailer 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com