Orange
Orange : కొన్ని ఫ్లాప్ చిత్రాలు ఈమధ్య కాలం లో రీ రిలీజ్ అవ్వడం, వాటికి అభిమానుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ రావడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. అప్పటి ఆడియన్స్ మైండ్ సెట్ కి అవి ఫ్లాప్స్ అయినప్పటికీ, జెనెరేషన్స్ మారేలోపు ఆ చిత్రాలు ఇప్పటి ఆడియన్స్ కి తెగ నచేస్తున్నాయి. అలా రీ రిలీజ్ లలో సెన్సేషన్ సృష్టించిన చిత్రాల్లో ఒకటి ఆరెంజ్. గత ఏడాది రామ్ చరణ్(Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు. ఫ్లాప్ సినిమాలను ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, ప్రింట్ ఖర్చులు వృధా అని రీ రిలీజ్ కి ముందు వెక్కిరించినా వాళ్ళు ఉన్నారు. కానీ విడుదల తర్వాత ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ని చూసి నిర్మాత నాగబాబు(Nagababu) సైతం షాక్ కి గురయ్యాడు. మొదటి రీ రిలీజ్ లో ఈ చిత్రానికి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చాయి.
ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా మరోసారి ఈ చిత్రాన్ని నేడు విడుదల చేసారు. అప్పట్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో, ఇప్పుడు కూడా అదే రేంజ్ రెస్పాన్స్. నేడు విడుదలైన కొత్త సినిమాలను ఆడియన్స్ అసలు పట్టించుకోలేదు. ప్రతీ ఒక్కరు ఆరెంజ్ మేనియా లో మునిగి తేలుతున్నారు. చాలా తక్కువ షోస్ తోనే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు కానీ, షోస్ మొత్తం హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. డిమాండ్ ని గమనించిన బయ్యర్స్ అన్ని ప్రాంతాల్లోనూ షోస్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీస్ లో ఈ చిత్రాన్ని వీకెండ్ వరకు ప్రదర్శించబోతున్నారు. రేపటికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. కొన్ని థియేటర్స్ లో అయితే నేడు విడుదల చేసిన కొత్త సినిమాల షోస్ ని రద్దు చేసి ‘ఆరెంజ్'(Orange Movie) చిత్రానికి కేటాయిస్తున్నారు. మొదటిసారి రీ రిలీజ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు, రెండవసారి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే సాధారణమైన విషయం కాదు.
కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమాకి 50 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా కోటి రూపాయిల గ్రాస్ మొదటి రోజు నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ‘ఆరెంజ్’ మూవీ థియేటర్స్ లో సాంగ్స్ వస్తున్నప్పుడు ఆడియన్స్ అందరూ పైకి లేచి పాడడం, దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవ్వడం వంటివి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆడియన్స్ పాట పడుతున్నప్పుడు థియేటర్ ఓనర్ ఆడియో ని మ్యూట్ చేశాడు. తెర మీద రామ్ చరణ్ డ్యాన్స్ వేస్తుండగా, థియేటర్ లో ఉన్న ఆడియన్స్ కోరస్ పాడడం చూసే వాళ్లకు చాలా బాగా అనిపించింది. ఇది కదా సినిమాని ఎంజాయ్ చేయడమంటే అంటూ ఈ వీడియోని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియో ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.
Fans unite to sing the national anthem of the Orange Nation. #Orange4K pic.twitter.com/VSco8ylLb5
— Baazigar ☠ (@SrkRcStan) February 14, 2025
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Orange re release theaters turned into music concerts video going viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com