YSR Congress : మరో 30 ఏళ్ల పాటు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీదే అధికారం. ఇక మా పార్టీకి తిరుగులేదు.. అంటూ చెప్పుకొచ్చారు అధినేత జగన్మోహన్ రెడ్డి. వై నాట్ 175 అన్న నినాదాన్ని కూడా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీకి భారీ కార్యాలయాలను నిర్మించారు. కానీ ఇప్పుడు ఒక్కో కార్యాలయానికి టూ లెట్ బోర్డు పెడుతున్నారు. ఇప్పుడు ఇదే సంచలనాంశంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తగిలింది. 11 స్థానాలకు పరిమితం అయింది ఆ పార్టీ. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. పార్టీ నుంచి ఒక్కోనేత బయటకు వెళ్తున్నారు. ఒక వెలుగు వెలిగిన నాయకులు సైతం గుడ్ బై చెబుతున్నారు. నేతలు అలా వెళ్ళిపోతుంటే.. పార్టీ ఆఫీసులు వెలవెలబోతున్నాయి. వాటిని అద్దెకు ఇచ్చేందుకు హై కమాండ్ సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read : జనసేనలోకి ఆ నేత.. పవన్ సంచలనం!
* చాలా రోజులుగా సేవలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర కార్యాలయం ఉండేది. తాడేపల్లిలో( Tadepalli ) తన నివాసాన్ని కార్యాలయంగా మార్చుకున్నారు. అయితే అంతకంటే ముందే పార్టీ కేంద్ర కార్యాలయంగా ఉన్న భవనానికి ఇప్పుడు అద్దెకు ఇచ్చేందుకు సిద్ధపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాడేపల్లి బైపాస్ లో మెయిన్ రోడ్డుపై ఈ భవనం ఉండేది. కార్యకర్తలు, నేతలతో కోలాహాలంగా ఉండేది. తమ ఇబ్బందులను చెప్పుకునేందుకు ఇదొక వేదికగా నిలిచేది. పార్టీ ఓటమి తర్వాత ఈ భవనం వినియోగాన్ని తగ్గించేశారు. పార్టీ కార్యాలయం ఇక్కడి నుంచి ఖాళీ చేయించి క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేశారు.
* అక్కడ కార్యకర్తలకు నో ఎంట్రీ..
తాడేపల్లిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యాలయానికి సామాన్య కార్యకర్త వెళ్ళలేని పరిస్థితి. జగన్( Jagan Mohan Reddy) వచ్చినప్పుడే ఆ కార్యాలయంలో సందడి ఉంటుంది. లేకుంటే ఒక్కడు కూడా ఉండని పరిస్థితి అక్కడిది. అయితే మెయిన్ రోడ్ లో ఉన్న పార్టీ కార్యాలయం ఖాళీ చేసే సరికి టులెట్ బోర్డు పెట్టారు సంబంధిత యజమాని. ఆ యజమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బకాయి పడినట్లు కూడా ప్రచారం నడుస్తోంది. ఐదేళ్లు అధికారం అనుభవించిన ఆ పార్టీ అద్దె కట్టకపోవడం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. ఏది ఏమైనా పార్టీ కార్యాలయ భవనానికి అద్దె చెల్లించుక పోవడం విమర్శలకు తావిస్తోంది.
* పార్టీ శ్రేణుల కలవరపాటు
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలు పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామన్న అధినేత పార్టీ కార్యాలయాన్ని( Party office ) కూడా నడపలేని స్థితిలో ఉన్నారా? అని సగటు అభిమాని ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే దశాబ్దాల పాటు పార్టీని ఎలా నడుపుతారని నిలదీస్తున్నారు. మొత్తానికైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కార్యాలయ భవనం హాట్ టాపిక్ అవుతోంది. పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారుతోంది.
Also Read : వైఎస్ఆర్ కాంగ్రెస్ కొంపముంచుతోంది ఆ ప్రచారమే!