Homeఆంధ్రప్రదేశ్‌Sakshi Vs ABN: 'ఏబీఎన్'పై సరే.. అలా అయితే 'సాక్షి'ని ఏం చేయాలి

Sakshi Vs ABN: ‘ఏబీఎన్’పై సరే.. అలా అయితే ‘సాక్షి’ని ఏం చేయాలి

Sakshi Vs ABN: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్ వెళ్లారు. ఎందుకో తెలుసా? ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి. ఎందుకో తెలుసా? ఆర్కే వీకెండ్ కామెంట్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శించినందుకు. అయితే జగన్ పై ఆర్కే విమర్శలు కొత్త కాదు. ఎందుకంటే వీకెండ్ కామెంట్ జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డికి కోపం తెప్పించినట్టుంది ఆర్కే విశ్లేషణ. అందుకే ధర్నాలు చేయాలని పార్టీ నేతలకు ఆదేశించినట్టు […]

Sakshi Vs ABN: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్ వెళ్లారు. ఎందుకో తెలుసా? ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి. ఎందుకో తెలుసా? ఆర్కే వీకెండ్ కామెంట్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శించినందుకు. అయితే జగన్ పై ఆర్కే విమర్శలు కొత్త కాదు. ఎందుకంటే వీకెండ్ కామెంట్ జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డికి కోపం తెప్పించినట్టుంది ఆర్కే విశ్లేషణ. అందుకే ధర్నాలు చేయాలని పార్టీ నేతలకు ఆదేశించినట్టు ఉన్నారు. ఏపీలో వద్దు హైదరాబాదులోని ఏబీఎన్ ఆఫీసు ముందు ధర్నా చేయాలని సూచించినట్టు ఉన్నారు. అందుకే హైదరాబాద్ లో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే ఈ పరిణామంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎంతో ప్రయోజనం. ఎందుకంటే పాపులారిటీతో పాటు దండిగా వ్యూయర్షిప్ ఉంటుంది. అంతకంటే రాధాకృష్ణకు కావాల్సింది ఏముంది?

* తిరిగి వైసీపీపై కథనాలు…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏబీఎన్ కార్యాలయం ముందు ధర్నా చేయడం.. దానిపై నిరంతరాయంగా ఏబీఎన్ కథనాలు ప్రచురించడం జరిగిపోయింది. అయితే ఆర్కే పదునైన మాటలతో ఈ వీకెండ్ కామెంట్ కొనసాగింది. జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా నమ్మడం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు ఆర్కే. జగన్ నంది అంటే నంది.. పంది అంటే పంది అని నమ్మే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. చివరకు సొంత కుటుంబ సభ్యుల విషయంలో సైతం జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది నమ్మేస్తారని తన వీకెండ్ కామెంట్లో రాసుకోవచ్చారు ఆర్కే. దీంతో మహిళలు అనే పాయింట్ తీసుకొని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై దండయాత్ర చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఆర్కె. అయితే తానా మహిళలను విమర్శించింది.. అంటూ మైండ్ బ్లాక్ అయ్యేలా కథనాలు ప్రచురిస్తోంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. ఎలా? ఎక్కడ? అవమానించారో కూడా వివరణాత్మక కథనాలు ప్రచురిస్తోంది ఏబీఎన్.

* ఖండించాలి తప్ప..
సాధారణంగా మీడియా సంస్థల ముందు ధర్నాలు చేయకూడదు. చెడులను ఖండించాలి తప్ప. అలా అయితే సాక్షి కార్యాలయాలను రోజూ ధ్వంసం చేయాలి. వాస్తవానికి ఆర్కే వీకెండ్ కామెంట్ అనేది న్యూస్ కాదు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. దానిపై వేరే అభిప్రాయం ఉంటే ఖండించాలి. పోనీ సొంత మీడియా ఉంది కదా సాక్షిలో అటువంటివి చేయొచ్చు కదా అంటే.. కుదిరే పని కాదన్నట్టు కనిపిస్తున్నారు. వీకెండ్ కామెంట్ ఆర్కే రాస్తోంది ఇప్పుడే కాదు.. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తోంది ఇప్పుడే కాదు.. చాలా రోజులుగా రాధాకృష్ణ అదే పనిగా విమర్శిస్తున్నారు. అప్పుడు లేని కోపం ఇప్పుడు ఎందుకు. అనవసరంగా పనిగట్టుకుని హైదరాబాద్ వెళ్లడం ఎందుకు. అది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణకు ప్రచారం కల్పించడమే అవుతుంది. అందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినది ఏమీ ఉండదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper