Jagan , Pawan
Jagan and Pawan : ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది కావొస్తున్నా.. రాజకీయ వేడి(Political Heat) మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు కూటమి సర్కార్ ప్రతిపక్ష వైసీపీ(YCP) నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపుతోంది. అయినా.. ఆ పార్టీ నేతలు తగ్గడం లేదు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి వైఫల్యాలను ఎత్తి చూపేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను తప్పు పట్టినవారిపైనా ప్రభుత్వం కేసులు పెడుతుండడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికీ పట్టు పడుతున్నారు. ఇక అధికారంలో ఉన్న చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pavan Kalyan) ఇప్పుడు జగన్ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. జగన్ కూడా తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నడిచిన విధంగానే 2025 సమ్మర్‌లో పొలిటికల్ హీట్ కొనసాగుతుందని తెలుస్తోంది. ఈమేరకు ప్రతిపక్ష నేత జగన్ ప్లాన్ చేసుకుంటుండగా, మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. దీంతో ఇద్దరూ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈమేరకు ముహూర్తాలు చూసుకుంటున్నారు.
Also Read : అటు జగన్.. ఇటు చంద్రబాబు.. మధ్యలో పవనూ అప్ డేటడే..
మారుతున్న జగన్ డేట్లు..
జగన్ మొదట డిసెంబర్(Decembar)లో ప్రజాక్షేత్రంలోకి వస్తానని, పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. తర్వాత సంక్రాంతి తర్వాత అని తెలిపారు. మళ్లీ వాయిదా వేశారు. శివరాత్రి తర్వాత అని ప్రకటించారు. ఇప్పుడు కొత్తగా ఉగాది తర్వాత అంటున్నారు. అంటే మార్చి 30న ఉగాది(Ugadi) ఉంది. ఏప్రిల్ నుంచి జగన్ జిల్లాల పర్యటన మొదలు పెట్టే అవకాశం ఉంది. అప్పటికి కూటమి ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు అవుతుంది. కాబట్టి జగన్ జనంలోకి వస్తే మంచి మైలేజీ వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పవన్ కూడా..
ఇక జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జనంలోకి రావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్(April)లో పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పవన్ టూర్ సాగుతుందని సమాచారం. ఇదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తారని తెలుస్తోంది. ఇక పవన్ టూర్ జగన్ పురిటి గడ్డ కడప లేదా వైసీపీ కంచుకోట రాయలసీమ(Rayalaseema) నుంచే మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.
శ్రీకాకుళం నుంచి జగన్..
ఇక జగన్ పర్యటన శ్రీకాకుళం(Srikakulam) జిల్లా నుంచి మొదలు పెడతారని తెలుస్తోంది. పవన్ పర్యటన అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు నేతలు ఒకేసారి జనంలోకి వస్తే సమ్మర్ మరింత హీటెక్కడం ఖాయం. ఇప్పటికే ఈ సమ్మర్ చాలా హాట్‌గా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పుడు జగన్, పవన్.. రాజకీయలను కూడా అదే స్థాయిలో హీటెక్కించే అవకాశం కనిపిస్తోంది.
Also Read : పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు జగన్ పరీక్ష
Web Title: Jagan pawan summer action plan ap politics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com