Homeఆంధ్రప్రదేశ్‌Butta Renuka Assets Auction: వైసిపి మాజీ ఎంపీ కి షాక్.. ఆస్తుల వేలం!

Butta Renuka Assets Auction: వైసిపి మాజీ ఎంపీ కి షాక్.. ఆస్తుల వేలం!

Butta Renuka Assets Auction: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ మాజీ ఎంపీ బుట్టా రేణుక కు షాక్ తగిలింది. ఆమె ఆస్తుల వేలం వేయడానికి కీలక ప్రకటన వచ్చింది. ఆమెతో పాటు భర్త నీలకంఠం ఆస్తులను సైతం వేలం వేయనున్నారు. ఈ మేరకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటన జారీ చేసింది. 2018లో తీసుకున్న రూ.340 కోట్ల రుణం.. ఇప్పుడు రూ.782.70 కోట్ల వరకు పెరిగింది. రుణం తిరిగి చెల్లించకపోవడంతో బుట్టా […]

Butta Renuka Assets Auction: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ మాజీ ఎంపీ బుట్టా రేణుక కు షాక్ తగిలింది. ఆమె ఆస్తుల వేలం వేయడానికి కీలక ప్రకటన వచ్చింది. ఆమెతో పాటు భర్త నీలకంఠం ఆస్తులను సైతం వేలం వేయనున్నారు. ఈ మేరకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటన జారీ చేసింది. 2018లో తీసుకున్న రూ.340 కోట్ల రుణం.. ఇప్పుడు రూ.782.70 కోట్ల వరకు పెరిగింది. రుణం తిరిగి చెల్లించకపోవడంతో బుట్టా రేణుక దంపతుల ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. ఇది ఒక రకంగా షాకింగ్ పరిణామమే. దీనిపై బుట్టా రేణుక ఎలా ముందుకెళ్తారో చూడాలి.

* భారీగా అప్పులు..
బుట్టా రేణుక( botta Renuka) దంపతులు వ్యాపార అవసరం నిమిత్తం.. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి రూ.340 కోట్లు రుణంగా తీసుకున్నారు. మొదట్లో వాయిదాలు సక్రమంగానే చెల్లించేవారు. అయితే తరువాత చెల్లింపులు చేయకపోవడంతో రుణంతో పాటు వడ్డీ పేరుకుపోయింది. రూ.782.07 కోట్ల వరకు చేరింది వారి అప్పు. ఎల్ఐసి బకాయిలను చెల్లించాలని నోటీసులు కూడా పంపించింది. ఈ క్రమంలో ఆ సంస్థ ప్రతినిధులతో బుట్ట రేణుక సంప్రదింపులు జరిపారు. కానీ కొలిక్కి రాలేదు. అందుకే ఇప్పుడు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. బుట్టా దంపతులు తనకా పెట్టిన ఆస్తులను వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వేలం ప్రక్రియను కూడా ప్రారంభించారు.

* ఇది రెండోసారి..
ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్( LIC Housing Finance Limited) బెంగళూరు శాఖ బుట్టా రేణుక దంపతుల ఆస్తులను వేలం వేయడానికి ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ కెపిహెచ్బి కాలనీలోని సర్వేనెంబర్ 1009, ఫేస్ 6 లో వారికి ఉన్న 3,383 చదరపు గజాల స్థలాన్ని కూడా వేలం వెయ్యనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ప్రకటనలో మెరీడియన్ స్కూల్ భవనం కూడా ఉంది. ఈ మొత్తం ఆస్తి విలువ రూ.65 కోట్లు ఉన్నట్లు ఎల్ఐసి నిర్ణయించింది. మార్చి 24న వేలం వేస్తామని కూడా స్పష్టం చేసింది. పొలిటికల్ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ అవుతోంది. అయితే గతంలోనే ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధం కాగా.. ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు మరోసారి వేలం వేసేందుకు నిర్ణయించారు. 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ గెలిచారు బుట్టా రేణుక. టిడిపిలోకి వచ్చి.. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఆస్తుల వేలం ప్రకటన రావడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper