YSR and CBN Friendship: ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) రాజకీయాల్లో చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డిలు ఎన్నో రకాల సంచలనాలకు కారణమయ్యారు. దశాబ్దాల పాటు ఏపీ రాజకీయాలను శాసించారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి కి చంద్రబాబు మంచి మిత్రుడు అని తెలుసు. అయితే వారి మధ్య ఉన్న బంధాన్ని చంద్రబాబు సైతం తరచూ చెబుతుంటారు. తనకు మంచి స్నేహితుడని అభివర్ణిస్తుంటారు. అయితే వారి మధ్య స్నేహానికి మించి మంచి అవగాహన ఉండేదని తెలుస్తోంది. చంద్రబాబు వైవాహిక జీవితం, తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ వెనుక రాజశేఖర్ రెడ్డి ఉన్నారని తాజాగా వెల్లడయ్యింది. అదే ఇప్పుడు ఏపీలో ప్రధాన చర్చకు దారితీస్తోంది. చంద్రబాబు ఉన్నతి వెనుక రాజశేఖర్ రెడ్డి ఉన్నారా? వారి మధ్య బంధం అంత గొప్పదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్.
Also Read: ఏపీ లిక్కర్ కేసులో జగన్ బంధువులు?
6 గంటల నిడివితో వెబ్ సిరీస్
ఇటీవల మయసభ( Maya Saba ) అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఆరు గంటల నిడివి గల ఈ వెబ్ సిరీస్ లో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి మధ్య మంచి బంధాన్ని చూపించారు దర్శకుడు దేవాకట్ట. ఎన్నెన్నో ఆసక్తికర పరిణామాలను వెల్లడించారు. ఈ ఇద్దరు విషయాలే కాదు. ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, పరిటాల రవి, వంగవీటి రాధా, నాదేండ్ల భాస్కర రావు.. ఇలా అప్పట్లో చక్రం తిప్పిన అనేకమంది ముఖ్య నేతల పాత్రలతో ఈ సిరీస్ కొనసాగింది. అయితే చంద్రబాబుతో పాటు రాజశేఖర్ రెడ్డి పాత్రలను మాత్రం వాస్తవానికి దగ్గరగా చూపించారు. ఆదిలో ఇద్దరు మిత్రులు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీలో తొలిసారిగా ఇద్దరూ ఎమ్మెల్యేలు అయ్యారు. మంత్రి పదవులు చేపట్టారు. చంద్రబాబు టిడిపిలో ఎంట్రీ ఇచ్చాక ఇద్దరి దారులు వేరయ్యాయి. రాజకీయంగా విభేదించుకున్నారు. కానీ ఒకే పార్టీలో ఉన్న సమయంలో.. వేరువేరు పార్టీల్లో కొనసాగిన సమయంలో సైతం ఒకరినొకరు సహకరించుకున్నారని తాజాగా ఈ సిరీస్ లో వెల్లడించారు.
ఎన్టీఆర్ కుమార్తెతో వివాహం వెనుక..
అయితే కాంగ్రెస్( Congress) పార్టీలో ఉన్న చంద్రబాబును.. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో వివాహం జరిపించడం వెనుక రాజశేఖర్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. అంతేకాకుండా 1983లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత చంద్రబాబును టిడిపిలోకి పంపించింది రాజశేఖర్ రెడ్డి అని తాజాగా ఈ సిరీస్ లో వెల్లడించారు. నాడు చంద్రబాబు 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేశారు. టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. 1985 ఎన్నికల్లో అవకాశం వచ్చినా పోటీ చేయలేదు. 1989 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చారు. 2004లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. 2010లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. అయితే వీరి ఇద్దరి మధ్య స్నేహం చిరకాలం కొనసాగిందని.. పరస్పరం రాజకీయంగా సహకరించుకున్నారని ఈ సిరీస్లో తెలపడం మాత్రం విశేషం.
Also Read: ఆ ఐదుగురిని నమ్ముకున్న జగన్!
వాస్తవానికి దగ్గరగా..
రాజశేఖర్ రెడ్డి( Rajasekhar Reddy ), చంద్రబాబుల మధ్య రాజకీయ విభేదాలు పతాక స్థాయిలో ఎప్పుడు కనిపించేవి కావు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం కూడా చాలా అరుదు. కక్ష సాధింపు చర్యలు కూడా లేవు. పైగా కాంగ్రెస్ పార్టీలో ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యారు. మంత్రులుగా వ్యవహరించారు. ఇద్దరి మధ్య స్నేహం కూడా అలానే ఉండేది. అందుకే ఇప్పుడు దేవా కట్టా వెబ్ సిరీస్ లో చిన్న కల్పితాలు జోడించి.. అసలు విషయం చెప్పారని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత ప్రతీకార రాజకీయాలకు చెప్పేందుకు ఇటువంటి సిరీస్ లను ఎక్కువమంది ఆహ్వానిస్తున్నారు.