Telangana Financial Situation
Pankaj Chaudhary : తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎదుగుదల పథంలో ఉన్నప్పటికీ, దాని అప్పుల భారం గురించి కేంద్ర ప్రభుత్వం(Central Government) ఇటీవల లోక్‌సభలో కీలక వివరాలను వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి(Pankaj Choudary) ప్రకారం, తెలంగాణ రాష్ట్ర అప్పు ప్రస్తుతం రూ.4,42,298 కోట్లుగా ఉంది. ఈ మొత్తంతో దేశంలోని రాష్ట్రాల అప్పుల జాబితాలో తెలంగాణ 24వ స్థానంలో నిలిచింది. ఈ అప్పులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చినప్పటికీ, అదే సమయంలో రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగంలో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. గత ఆరు సంవత్సరాల్లో 10,189 ఐఖీ కంపెనీలు ప్రారంభమవ్వడం దీనికి నిదర్శనం.
Also Read : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: ‘కొండా’ఔట్, రేవంత్ కొత్త టీమ్ రెడీ!
ఐటీతో ఆర్థిక వృద్ధి..
కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ కంపెనీలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చాయి. గత ఐదేళ్లలో ఈ సంస్థల ద్వారా రూ.14,865 కోట్ల టర్నోవర్ సాధించడం గమనార్హం. అయితే, అదే కాలంలో 3,369 IT సంస్థలు మూతపడటం కూడా ఆందోళనకర విషయం. ఈ గణాంకాలు తెలంగాణలో IT రంగం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, దాన్ని నిలబెట్టుకోవడంలో సవాళ్లు ఉన్నాయని సూచిస్తున్నాయి.
అప్పులకు కారణాలు..
రాష్ట్రంలో అప్పులు పెరగడానికి వివిధ కారణాలు ఉండవచ్చు. మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇతర ఖర్చులు ఇందులో భాగంగా ఉంటాయి. అయినప్పటికీ, IT రంగం ద్వారా వచ్చే ఆదాయం ఈ అప్పుల భారాన్ని తగ్గించే దిశగా ఒక అవకాశంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ను IT హబ్‌గా మార్చడంలో సాధించిన విజయం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే, సంస్థలు మూతపడకుండా నిరంతరం వృద్ధిని కొనసాగించేందుకు వ్యూహాత్మక చర్యలు అవసరం.
మొత్తంగా, తెలంగాణ ఆర్థిక స్థితి ఒక వైపు అప్పుల భారంతో కొనసాగుతుండగా, మరోవైపు IT రంగంలో అవకాశాలతో సమతుల్యం పాటిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఈ రెండు అంశాలను సమర్థవంతంగా నిర్వహించగలిగితే, భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది. ఐఖీ కంపెనీల సంఖ్యను పెంచడంతో పాటు వాటి దీర్ఘకాలిక ఉనికికి ప్రణాళిక(Plannings)లు రూపొందించడం ద్వారా అప్పులను నియంత్రించే దిశగా అడుగులు వేయవచ్చు.
Also Read : కొత్త పార్కింగ్ ఫీజు నిబంధనలు.. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో అమలు
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Pankaj chaudhary union minister pankaj chaudharys statement on the financial situation of telangana state
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com