Homeఆంధ్రప్రదేశ్‌YSR Birth Anniversary: వైఎస్ జయంతి వేడుకలు.. వైసీపీ సీనియర్ నేతలు డుమ్మా!

YSR Birth Anniversary: వైఎస్ జయంతి వేడుకలు.. వైసీపీ సీనియర్ నేతలు డుమ్మా!

YSR Birth Anniversary: అమరావతి : తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు జగన్. పార్టీ ఆవిర్భావం నుంచి రాజశేఖర్ రెడ్డి కి సంబంధించి వర్ధంతి, జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.కానీ నిన్న మాత్రం జయంతి వేడుకలను సాదాసీదాగా జరిపించి చేతులు దులుపుకున్నారు. కొన్నిచోట్ల అయితే సీనియర్లకు అసలు జయంతి వేడుకలు అన్న విషయమే తెలియదు. అసలు వేడుకలు జరిపించలేదు. ఒకరిద్దరు ద్వితీయ శ్రేణి నాయకులు హాజరై మమ అనిపించేశారు. విశాఖలో అయితే రీజనల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఒక్కరంటే ఒక్క సీనియర్ కూడా హాజరు కాలేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

జగన్ విశాఖకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పాలనా రాజధానిగా ఎంపిక చేయడంతో అక్కడ రాజకీయంగా బలపడాలని భావించారు.అందుకే బాబాయ్ వై.వి సుబ్బారెడ్డికి విశాఖ బాధ్యతలు అప్పగించారు. కానీ ఈ ఎన్నికల్లో విశాఖలో సైతం పార్టీ దారుణంగా దెబ్బతింది. కేవలం ఏజెన్సీలో రెండు సీట్లతో సరిపెట్టుకుంది.దాదాపు ఉత్తరాంధ్రను వైట్ వాష్ చేసింది ఆ పార్టీ. ఓటమి నుంచి ఆ పార్టీ నేతలు తేరుకోలేదు. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరుకావాలని పార్టీ హై కమాండ్ ఆదేశించినా.. రకరకాల కారణాలు చూపుతూ చాలామంది డుమ్మా కొట్టారు. మరికొందరైతే ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు.

ప్రస్తుతం విశాఖలో చాలామంది నేతలు వైసీపీకి దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, విశాఖ డెయిరీ చైర్మన్ ఎడారి ఆనందకుమార్, విశాఖ ఎంపీ ఏంవీవీ సత్యనారాయణ వైసిపి తో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రెస్ మీట్ పెట్టి మరి వైసిపి నాయకత్వంపై తిరుగుబాటు చేసినంత ప్రయత్నం చేశారు. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన బొత్స ఝాన్సీ లక్ష్మీ జాడలేదు. అందుకే సభలు సమావేశాలతో పాటు ఇటువంటి జయంతి వేడుకలను ద్వితీయ శ్రేణి నాయకత్వంతో జరుపుతుండడం విశేషం. విశాఖ నగరంతో పాటు జిల్లాలో ఎంతమంది నాయకులు పార్టీలో ఉంటారో? ఉండరో? తెలియని పరిస్థితి నెలకొంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Cockroach Janata Party Funding : కాక్రోచ్ జనతా పార్టీకి ఫండ్.. “లెక్క” భారీగానే ఉందిగా..

Cockroach Janata Party Funding : కావలసినంత ఆహారం వచ్చింది. డ్రై ఫ్రూట్స్ ఊహించని విధంగా వచ్చాయి. మెడికల్ కిట్లు.. ఫాస్ట్ ఫుడ్.. డ్రింక్స్.. టెంట్లు.. రాళ్లు.. రప్పలు.. ఇవన్నీ ఆకాశరామన్న పంపించినట్టు...

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
Oktelugu Epaper