https://oktelugu.com/

 Undavalli Arun Kumar : జగన్ తో చేరితే.. ఉండవల్లి తన మేధావితనాన్ని విడిచిపెడతారా?

ప్రస్తుతం రాజకీయ విశ్లేషణలతో కాలం గడుపుతూ వచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్. త్వరలో ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం నడుస్తోంది.

Written By: , Updated On : February 10, 2025 / 04:38 PM IST
Vundavalli Aruna Kumar
Follow us on

Undavalli Arun Kumar : ఉండవల్లి అరుణ్ కుమార్ ( undavalli Arun Kumar) వైసీపీలో చేరుతారా? ఆ వార్తలో నిజం ఎంత? అసలు జగన్ వద్ద ఆయన సర్దుబాటు కాగలరా? ఆ పరిస్థితి ఉందా? అంటే మాత్రం సమాధానం దొరకదు. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల చేసిన విశ్లేషణలతో.. ఆయన రాజకీయ విశ్లేషకుడిగా మారిపోయారు. అందుకే ఆయన వైసీపీలో ఇమడగలరా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. అయితే రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రెండుసార్లు ఎంపీ అయ్యారు. అందుకే ఇప్పుడు ఆయన కుమారుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా వైసీపీలో చేరుతారని ప్రచారం నడుస్తోంది.

* మంచి అవగాహన
ఉండవల్లి అరుణ్ కుమార్(undavalli Arun Kumar) నిజంగా మేధావి. మంచి వాగ్దాటి కలిగిన నాయకుడే. సమకాలిన రాజకీయ అంశాలపై ఆయన విశ్లేషణ చేస్తుంటారు. చాలా బాగా వివరణ ఇస్తుంటారు. అంతవరకు ఓకే కానీ.. ఆయనలో ఆశ్రిత పక్షపాతం ఇట్టే కనిపిస్తుంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు అధికారంలో ఉండేవారు. క్వార్టర్ మద్యం సీసాను చూపించి.. అందులో వచ్చే ఆదాయమంతా చంద్రబాబు ఇంటికి వెళుతుందని అద్దం వచ్చేలా చెప్పేవారు. అదే జగన్మోహన్ రెడ్డి పాలనలో నాసిరకం మద్యం ఉన్నా.. ఆయనకు కనిపించేది కాదు. అదంతా మంచి మద్యం అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉండేది. జగన్మోహన్ రెడ్డిని తిడుతూనే.. అందులోనూ ఆయన మంచి పాలన చేస్తున్నట్లు అర్థం వచ్చేలా మాట్లాడేవారు. అంత చతురత ఉండవల్లి అరుణ్ కుమార్ ది. అటువంటి కుహనా మేధావి ఇప్పుడు వైసీపీలోకి వెళ్తారంటే.. జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం ఉండదు. ఆయన బయట ఉండి జగన్మోహన్ రెడ్డిని పొగిడితేనే ఆయనకు మైలేజ్ దక్కేది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరిక అనేది ఉత్త ప్రచారమేనని తెలుస్తోంది.

* ఈనెల 26న చేరిక?
అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఈనెల 26న వైసీపీలో( YSR Congress ) ప్రచారం జరిగింది. ఇటీవల వైసిపికి కీలక నేత విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీ పదవులతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నారు. అయితే పార్టీలో ఇంకా చాలామంది కీలక నేతలు బయటకు వెళ్లిపోతారని ప్రచారం నడిచింది. అయితే ఇదే సమయంలో పిసిసి మాజీ చీఫ్ సాకే శైలజనాథ్ వైసీపీలో చేరారు. ఆయన బాటలో మరికొంతమంది ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అందులో ప్రధానంగా ఉండవెల్లి అరుణ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ ఉండవెల్లి చేరిక వైసీపీకి నష్టమా? లాభమా? అనే దానికంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇప్పటిలా ఉండవెల్లి అరుణ్ కుమార్ మాట్లాడలేరు. అందుకే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరరని తెలుస్తోంది.

* బయట ఉండడమే ఉత్తమం
ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీలో ఉండవల్లి అరుణ్ కుమార్ చేరే కంటే.. బయట ఉండి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎందుకంటే పార్టీలోకి వెళ్ళిపోతే.. ఎలాంటి వ్యాఖ్యలు చేసిన అది వైసిపి నేత కోణంలోనే చూస్తారు. అదే బయట ఉండి మాట్లాడితే సమాజంలో ఒక పెద్ద మనిషిలా భావిస్తారు. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరడం కంటే.. బయట ఉండడమే మేలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన వైసీపీలో చేరిక అనేది ఉత్త ప్రచారం అని సన్నిహితులు సైతం చెబుతుండడం విశేషం.