Saripoda Satya and Tandel : అక్కినేని నాగ చైతన్య నటించిన ‘తండేల్’ చిత్రానికి తెలుగులో భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఇది ఆల్ టైం రికార్డు అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. అయితే ఈ రేంజ్ వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం నార్త్ అమెరికా లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడడం లేదని సమాచారం. ఇటీవల కాలం లో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు ఓవర్సీస్ వసూలు కుంభస్థలం లాంటిది. గత నెలలో విడుదలైన విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కేవలం నార్త్ అమెరికా నుండే మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ‘తండేల్’ కి కూడా ఆ స్థాయి వసూళ్లు వస్తాయి అనుకుంటే, ఫుల్ రన్ లో 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా రావడం కష్టమే అంటున్నారు.
అక్కడి ట్రేడ్ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మూడు రోజుల్లో 6 లక్షల 50 వేల డాలర్లు మాత్రమే వచ్చాయట. గత ఏడాది నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రానికి కేవలం ప్రీమియర్ షోస్ నుండే 6 లక్షల డాలర్లు వచ్చాయి. ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి 1 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఆ వసూళ్లను ‘తండేల్’ చిత్రం క్లోజింగ్ లో కూడా అందుకోవడం కష్టమే అని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమాకి క్లోజింగ్ లో కేవలం 8 లక్షల 50 వేల డాలర్లు మాత్రమే వస్తాయట. ‘సరిపోదా శనివారం’ చిత్రం ఫుల్ రన్ లో దాదాపుగా మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఎంత వ్యత్యాసం ఉందో మీరే చూడండి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయి వసూళ్లను రాబడుతున్న ‘తండేల్’ చిత్రం నార్త్ అమెరికా లో ఈ విధంగా పడిపోవడానికి కారణాలు ఏమిటి అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు. ఈ చిత్రం నార్త్ అమెరికా లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 1.5 మిలియన్ డాలర్ల గ్రాస్ ని రాబట్టాలి. అది దాదాపుగా అసాధ్యం అనే అంటున్నారు. ఈమధ్య కాలం లో మంచి టాక్, పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుని నష్టాలను మిగిల్చిన ఏకైక సినిమాగా ‘తండేల్’ చిత్రం మిగిలిపోనుంది. డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అక్కడ ప్రవాసాంధ్రుల్లో సంక్షోభం ఏర్పడిందని, ఉద్యోగాలు పోతున్నాయని, ఇండియా కి అనేక మంది విద్యార్థులు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు తిరిగి వచేస్తున్నారని, సంక్షోభం లో ఉన్న ఇలాంటి సమయంలో అక్కడి ప్రవాసాంద్రులు సినిమాలు చూసే మూడ్ లో లేరని, అందుకే ‘తండేల్’ చిత్రానికి ఎఫెక్ట్ కొట్టిందని, రాబోయే పెద్ద సినిమాల పై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు.